Najam Sethi: “మేము కాదు.. వాళ్లే వెనక్కి తగ్గారు”.. పాక్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రెచ్చగొట్టే ప్రకటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Former PCB chairman Najam Sethi: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌పై ఓ క్లారిటీ వచ్చేసింది. తాము భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ఇంతటితో వివాదం ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే.. తాజాగా ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ నజామ్ సేథీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఈ విషయంలో పాకిస్థాన్ వెనక్కి తగ్గలేదని.. ఐసీసీయే ఒక అడుగు వెనక్కి వేసిందని వాదిస్తున్నారు. “నిజానికి ఐసీసీయే కొంచెం సడలించింది. బంగ్లాదేశ్‌పై కొంత అనుకూలంగా ప్రవర్తించాలని నిర్ణయించింది. పాకిస్థాన్ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ ఆడకపోతే ఎలాంటి శిక్షలు ఉండవని ముందే తెలుసుకున్నారు. దేశంలో, విదేశాల్లో ఉన్న ప్రముఖ న్యాయ నిపుణులతో మాట్లాడి ఈ నిర్ణయానికి వచ్చారు” అని సేథీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గతంలో జరిగిన కొన్ని ఉదాహరణలు పాకిస్థాన్‌కు బలం ఇచ్చాయని సేథీ చెప్పారు. మహా అంటే ఒక పాయింట్ కోల్పోయేవాళ్లం. అంతకంటే పెద్ద నష్టం ఏమీ ఉండేది కాదు. ఇది ఐసీసీకి కూడా అర్థమైంది. అందుకే ఐసీసీ స్వయంగా ముందుకు వచ్చి చర్చలు ప్రారంభించింది. డిప్యూటీ చీఫ్ ఇమ్రాన్ ఖవాజా రంగంలోకి దిగారు. బంగ్లాదేశ్ అధికారులు చర్చలకు వచ్చారు. ఆ తర్వాతే పాకిస్థాన్ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించిందని వివరించారు.
READ MORE: UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
Also Read
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
- Suryakumar Yadav: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆ క్షణం మర్చిపోలేను.. ఒళ్లంతా చెమటలు పట్టాయ్..
ఇక ఆర్థిక విషయంపై సేథీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ నిధులపై ఆధారపడేదని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు. ఇప్పుడు పీఎస్‌ఎల్ భారీగా ఎదిగిందని.. పీఎస్‌ఎల్ నుంచి వచ్చే ఆదాయం ఐసీసీ కంటే ఎక్కువ అని చెప్పారు. కాబట్టి పాకిస్థాన్‌కు వనరుల కొరత అనే సమస్య లేదన్నారు. ఈ విషయంలో ఎప్పుడూ ఒత్తిడి అనేది లేదని అని స్పష్టం చేశారు. అయినా.. ఇక ముందు కూడా ఐసీసీ నుంచి కొన్ని సడలింపులు లేదా లాభాలు పాకిస్థాన్‌కు దక్కవచ్చు. మార్చి నాటికి మీరు కొన్ని కొత్త నిర్ణయాలు చూడవచ్చు అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. మొత్తానికి, పాకిస్థాన్ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలపై ఇరు వర్గాల కథనాలు భిన్నంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇది చర్చల ఫలితమని ఐసీసీ వర్గాలు చెబుతుండగా, మరోవైపు పాకిస్థాన్ బలమైన స్థితిలో ఉండటమే మార్పుకు కారణమని సేథీ వాదిస్తున్నారు.
READ MORE: Pakistan vs USA: “ఇదెక్కడి దిక్కు మాలిన బౌలింగ్ రా మావా?”.. పాక్ బౌలర్‌పై ట్రోలింగ్స్..
తాజావార్తలు
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్‌పై నెటిజన్ల ఫైర్!
-
Janvi : డర్టీ ఇమేజ్ నుంచి బయట పడాల్సింది పోయి ఇవేం పనులు జాన్వీ?
-
Beggar Woman’s Surprising Savings: జీవితాంతం వీధుల్లో భిక్షాటన చేసిన మహిళ.. మరణానంతరం బయటపడ్డ రూ.8.40 లక్షలు!
-
Violence Unlimited : సినిమా రంగానికి బాధ్యత లేదా?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!