Site icon NTV Telugu

IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. చెలరేగిన టీమిండియా స్పిన్నర్లు

Ind Vs Nz

Ind Vs Nz

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతోంది. రెండో రోజు టీమిండియా పట్టు బిగించింది. కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 171/9 పరుగులు చేసింది. న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో అజాజ్ పటేల్ 7 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

Read Also: AP CM Chandrababu: అన్నీ ప్రజల ముందు పెడతా.. రుషికొండ ప్యాలెస్ నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేసింది. ఆ తర్వాత.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసి.. 28 పరుగుల ఆధిక్యం రాబట్టుకుంది. కాగా.. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ స్పిన్ మాయాజాలంతో కివీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో.. పరుగులు రాబట్టలేకపోయారు. న్యూజిలాండ్ బ్యాటింగ్‌లో విల్ యంగ్ (51) పరుగులతో రాణించాడు. టామ్ లాథమ్ 1, డెవాన్ కాన్వే 22, రచిన్ రవీంద్ర 4, డారిల్ మిచెల్ 21, టామ్ బ్లండెల్ 4, గ్లెన్ ఫిలిప్ 26, ఇష్ సోధీ 8, మాట్ హెన్రీ 10 పరుగులు చేసి ఔట్ అయ్యారు. భారత్ బౌలర్లలో జడేజా 4 వికెట్లు, అశ్విన్ 3 వికెట్లు తీశారు. ఆకాశ్‌దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు చెరో వికెట్ దక్కింది.

Drunk and Drive Test : ఇకపై ORRపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు

Exit mobile version