Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇప్పటికే 2-0తో ఆధిపత్యంలో ఉన్న భారత జట్టు, మంగళవారం వెల్లింగ్టన్లో జరగనున్న మూడో టీ20లో సిరీస్ కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో తీవ్రంగా శ్రమించారు. భారత బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, సంజూ శామ్సన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ ధీర్ నెట్స్‌లో తమ బ్యాటింగ్ నైపుణ్యాలకు పదును పెట్టారు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో చెమటోడ్చగా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు.
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్‌లో జరిగిన మొదటి టీ20లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో శుభారంభం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 225/4 పరుగులు చేసి భారత్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఛేజింగ్‌లో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా, నమన్ ధీర్ కేవలం 15 బంతుల్లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సంచలనం సృష్టించాడు. దీంతో భారత్ 19.4 ఓవర్లలో 230/6 పరుగులు చేసి రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.
Also Read
- CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
- Michael Bracewell: భారత్ ఇలా చేస్తే మాకు గెలుపు అవకాశాలు లేనట్లే.. కివీస్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఆవేదన..
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
- Chandra Kumar Bose: "చరిత్రను వక్రీకరించడం నేరం".. ఫౌజీ టీజర్‌ను వెంటనే డిలీట్ చేయాలని నేతాజీ మనవడు డిమాండ్..
Getting into the groove in Wellington 💙
#TeamIndia | #NZvIND https://t.co/pBJHVSyvR5
— BCCI (@BCCI) October 26, 2026
https://t.co/IMPXW2Bk4r
— BCCI (@BCCI) October 26, 2026
అదే మైదానంలో జరిగిన రెండో టీ20లోనూ భారత్ విజయాన్ని పునరావృతం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 180/5 పరుగులు చేయగా, 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఒత్తిడిని జయించి 19.5 ఓవర్లలో 181/6 పరుగులు చేసి మరో ఆఖరి ఓవర్ థ్రిల్లర్ విజయాన్ని నమోదు చేసింది. తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతాయుత ఆటతీరుతో జట్టును విజయతీరాలకు చేర్చారు. వరుసగా రెండు మ్యాచ్‌లలో సాధించిన విజయాలతో భారత్ ప్రస్తుతం సిరీస్‌పై పూర్తి పట్టు సాధించింది. అక్టోబర్ 27న వెల్లింగ్టన్లో జరిగే మూడో టీ20లో కూడా గెలిచి సిరీస్‌ను ముగించాలని భారత్ పట్టుదలతో ఉంది.
తాజావార్తలు
-
Ind Vs NZ 3rd T20: వెల్లింగ్టన్ టీ20కి సర్వం సిద్ధం.. ప్రాక్టీస్‌లో చెమటోడ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్స్..
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
-
Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!