IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs New Zealand 2nd ODI: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేసి కేవలం 134 పరుగులకే ఆలౌట్ చేశారు. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. బౌలర్లు కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టారు. ముఖ్యంగా గర్నూర్ బ్రార్ నాలుగు వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. దీంతో భారత్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, విల్ యంగ్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. సీఫర్ట్ 5 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండా ఔట్ కాగా.. విల్ యంగ్ 17 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను ఔకిబ్ నబీ పడగొట్టి భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. ఆ తర్వాత హెన్రీ నికోల్స్ 26 బంతుల్లో 11 పరుగులు చేసి అన్షుల్ కాంబోజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. మరోవైపు డారిల్ మిచెల్ మాత్రం భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. నిలకడగా బ్యాటింగ్ చేస్తూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కెప్టెన్ టామ్ లాథమ్ 22 బంతుల్లో 7 పరుగులు చేసి గర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వెంటనే గ్లెన్ ఫిలిప్స్ కూడా ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
Also Read
- Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
- Revanth Reddy Birthday Wishes: వరి నారుతో సీఎం 'రేవంత్ రెడ్డి' చిత్రపటం.. వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపిన కాంగ్రెస్ నేత.!
- స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
- Pamphlets Along With Ballots: ఓట్లతోపాటు పాంప్లెట్లు వేసిన ఓటర్లు.. మా గ్రామంను కాపాడండి అంటూ..!
ఒకవైపు వికెట్లు వరుసగా పడుతున్నా.. డారిల్ మిచెల్ మాత్రం పోరాటం కొనసాగించాడు. 104 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేశాడు. అతడికి మిచెల్ సాంట్నర్ సహకరించాడు. సాంట్నర్ 38 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టును 100 పరుగుల మార్కును దాటించారు. అయితే అక్షర్ పటేల్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ ఔటవడంతో న్యూజిలాండ్ ఆశలకు గండి పడింది. భారత బౌలర్లలో గర్నూర్ బ్రార్ 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 9 ఓవర్లలో 28 పరుగులు, అన్షుల్ కాంబోజ్ 8 ఓవర్లలో 25 పరుగులు, ఔకిబ్ నబీ 7 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్ 7 ఓవర్లు బౌలింగ్ చేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు.
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. అధిక స్థానాల్లో టీడీపీ హవా..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
E20 Petrol Controversy: E20 కాదు.. 420! పెట్రోల్‌లో 31 శాతం ఇథనాల్?.. మోడీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్
-
Diwali Celebrations : అమెరికా టు కెనడా.. విదేశాల్లోనూ దీపావళి ధమాకా
-
Harry Boxer Detained in US: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కీలక అనుచరుడు హ్యారీ బాక్సర్ అరెస్ట్..
-
Independent Candidate Victory: జనసేనకు ఝలక్.. 373 ఓట్ల తేడాతో ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం..!
ట్రెండింగ్
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!
-
క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చుకోవచ్చు.. 286cc ఇంజిన్, 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో Honda Rebel 300 వచ్చేస్తోంది..
-
500+ kmph వేగాన్ని దాటిన తొలి ప్రొడక్షన్ కారు.. BYD Yangwang U9 Xtreme గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం.!
-
Mohammed Shami Retirement: టెస్టులకు గుడ్‌బై చెప్పిన రివర్స్ స్వింగ్ కింగ్ ‘మహమ్మద్ షమీ’..!
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?