NTV Telugu Site icon

India vs Bangladesh: పొట్టి ప్రపంచకప్‌ కు ముందే భారత్, బంగ్లాదేశ్‌ టీ 20 సిరీస్.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

4.

4.

మార్చి 22, 2024 నుండి భారతదేశంలో ఐపీఎల్ 17 వ సీజన్ జరుగుతోంది. మే 26న ఈ సీజన్ కు తెరపడనుంది. మే 26న చెన్నై వేదికగా ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ జరుగుతోంది. ఈ సీజన్ తర్వాత టీమిండియా జూన్ 1 నుంచి జరగబోయే టి20 ప్రపంచ కప్ లో పాల్గొననుంది. ఇకపోతే భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య టి20 సిరీస్ జగనన్నట్లుగా ఐసీసీ తెలిపింది. అయితే ఇది భారత మహిళల జట్టు సంబంధించిన విషయం. ఈ ఏడాది పురుషుల టీమ్స్ మాత్రమే కాకుండా.. మహిళల టి20 వరల్డ్ కప్ కూడా బంగ్లాదేశ్ లో జరగబోతోంది.

Also read: IPL 2024: ముంబై ఇండియన్స్‌కు గుడ్‌న్యూస్‌.. సూర్య వచ్చేస్తున్నాడు!

దీంతో మహిళల జట్టును ప్రపంచ కప్పుకు సిద్ధం చేసేందుకు టీమిండియాను బంగ్లాదేశ్ పర్యటన చేయబోతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన టి20 సీరిస్ ను ఐసీసీ ప్రకటించింది. సోషల్ మీడియా ద్వారా ఐసీసీ బంగ్లాదేశ్ టీమిండియా మహిళల టీ 20 సిరీస్ వివరాలను తెలిపింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 28 నుంచి మే 9 వరకు ఈ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏప్రిల్ 23న టీమిండియా మహిళలు బంగ్లాదేశ్ కు చేరుకొనున్నారు. ఆపై మే 10న తిరుగు ప్రయాణం చేయబోతోంది భారత మహిళల క్రికెట్ జట్టు. ఇక షెడ్యూల్ వివరాలు చూస్తే..

Also read: Sangareddy: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం.. 6కి చేరిన మృతుల సంఖ్య

మొదటి మ్యాచ్ 28 ఏప్రిల్, రెండవ మ్యాచ్ 30 ఏప్రిల్, మూడవ మ్యాచ్ మే 2, నాలుగో మ్యాచ్ మే6వ తేదీ, ఐదవ మ్యాచ్ మే9వ తేదీల్లో బాంగ్లాదేశ్ వేదికగా జరుగుతాయి. ఇకపోతే చివరి బంగ్లాదేశ్ టూర్‌ లో మహిళల జట్టు సిరీస్ గెలవలేకపోయింది. ఉమెన్స్ టీమిండియా వర్సెస్ ఉమెన్స్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకు మొత్తం 13 టీ-20 మ్యాచ్‌ లు జరుగగా.. అందులో 11 మ్యాచ్‌ ల్లో టీమిండియా విజయం సాధించింది. బంగ్లాదేశ్ కేవలం 2 మ్యాచ్‌ ల్లో మాత్రమే విజయం అందుకుంది.