NTV Telugu Site icon

IND vs AUS: ముగిసిన రెండో రోజు ఆట.. ఒక్కరోజే 15 వికెట్లు

Sydney Test

Sydney Test

IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రోజు ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 6 వికెట్లకు 141 పరుగులు చేసింది. దింతో భారత్ మొత్తం ఆధిక్యం 145 పరుగులకు చేరుకుంది. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 39 బంతుల్లో ఒక ఫోర్‌ సహాయంతో 8 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 17 బంతుల్లో 6 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆస్ట్రేలియా తరఫున స్కాట్ బోలాండ్ 4 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున రిషబ్ పంత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకున్నాడు. శనివారం ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. ఇందులో ఆస్ట్రేలియావి 9 వికెట్లు, భారత్ వి 6 వికెట్లు నేలకూలాయి.

Also Read: Kakani Govardhan Reddy: అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తామంటున్న మాజీ మంత్రి

ఇక మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 185 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 181 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దానితో టీమిండియాకు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియా పర్యటనకు మొదటిసారి వెళ్లగా.. ప్రస్తుత సిరీస్ లో భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్ గా నిలిచాడు. ఐదు టెస్టుల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేసి, తొలి సిరీస్‌లోనే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా 47 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఒకే సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు.

Show comments