Ruturaj Gaikwad Makes History: సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమిండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 154 పరుగులు చేసింది. మెక్ డర్మాట్ (54; 5 సిక్సర్లు) అర్ధ శతకం బాదాడు.
Also Read: Lowest Victory Margin: 16 ఓట్ల తేడాతో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి!
ఈ టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఐదవ టీ20 మ్యాచ్‌లో రుతురాజ్ 10 పరుగులకే ఔటైనా.. మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‌లో 55.75 సగటుతో 223 పరుగులు చేశాడు. దాంతో ఆస్ట్రేలియాపై ఓ టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 2021లో న్యూజిలాండ్ మాజీ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 5 మ్యాచ్‌ల్లో 218 పరుగులు చేశాడు. మోతంగా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ తర్వాత ఒకే సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు.