India Unemployment Rate: ఈ ఏడాది డిసెంబర్ డేటా. సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Unemployment Rate: ఈ సంవత్సరం ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిసెంబర్ నెలలో అత్యధికంగా నమోదైంది. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనే సంస్థ వెల్లడించింది. భారతదేశ నిరుద్యోగ రేట్ 2022 డిసెంబర్ 20వ తేదీ నాటికి 9 శాతానికి చేరింది. థర్టీ డే మూవింగ్ యావరేజ్ ప్రాతిపదికన ఇది నవంబర్‌లో 8 శాతంగానే ఉంది. నెల రోజుల్లోనే వన్ పర్సెంట్ పెరిగింది.
సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వచనం ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే.. పని చేయటానికి సిద్ధంగా ఉన్న వ్యక్తుల సంఖ్య అని అర్థమే తప్ప ఉద్యోగం దొరకనివారి సంఖ్య అని కాదు. గడచిన 12 నెలల యావరేజ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 7 పాయింట్ 4 అని సీఎంఐఈ రిపోర్టు తెలిపింది. ఈ సగటు నిరుద్యోగ రేట్ 6 పాయింట్ 4 నుంచి 8 పాయింట్ 3 రేంజ్లో ఊగిసలాడినట్లు పేర్కొంది.
Also Read
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
Gold Shine in 2023: వచ్చే ఏడాది.. మాంద్యం వచ్చినా.. రాబడి తగ్గినా.. నో ఎఫెక్ట్..
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పట్టణ ప్రాంతాల్లో ఏకంగా 10 శాతానికి, గ్రామీణ ప్రాంతాల్లో 8 పాయింట్ 5 శాతానికి చేరటం పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్య విషయమని వివరించింది. రూరల్ ఏరియాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో ఉన్నప్పటికీ నిరుద్యోగం రేట్ పట్టణ ప్రాంతాల కన్నా ఎక్కువ హెచ్చుతగ్గులకు లోనైందని సీఎంఐఈ ఎండీ అండ్ సీఈఓ మహేశ్ వ్యాస్ అన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ హర్యానాలో ఎక్కువగా ఉంది. అక్కడ నవంబర్ నెలలో నిరుద్యోగం రేట్ 30 పాయింట్ 6 శాతానికి ఎగబాకింది. హర్యానా తర్వాత 24 పాయింట్ 5 శాతంతో రాజస్థాన్ రెండో స్థానంలో ఉంది. 23 పాయింట్ 9 శాతంతో జమ్మూకాశ్మీర్ మూడో స్థానంలో నిలిచింది. నిరుద్యోగం రేట్ ఛత్తీస్‌గఢ్‌లో అతితక్కువగా.. అంటే.. సున్నా పాయింట్ ఒక శాతమే ఉండటం విశేషం.
1 పాయింట్ 2 శాతంతో ఉత్తరాఖండ్, 1 పాయింట్ 6 శాతంతో ఒడిశా.. రెండు.. మూడు స్థానాల్లో ఉన్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్.. ఈపీఎఫ్ఓ లెక్కల ప్రకారం.. ఫార్మల్ జాబ్ క్రియేషన్ సైతం భారీగా పడిపోయింది. సెప్టెంబర్‌లో 16 లక్షల 80 వేల మందికి పైగా ఉద్యోగాల్లో చేరగా ఆ సంఖ్య అక్టోబర్‌లో 12 లక్షల 90 వేలకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 3వ అతితక్కువ ఉద్యోగ చేరికలు కావటం గమనించాల్సిన విషయం.
ఇదిలాఉండగా.. ఫార్మల్ జాబ్ క్రియేషన్‌లో.. గతేడాది అక్టోబర్‌తో పోల్చితే ఈ సంవత్సరం అక్టోబర్‌లో మార్జినల్ గ్రోత్ చోటుచేసుకోవటం చెప్పుకోదగ్గ విషయం. ఈసారి కన్నా పోయినేడాది అక్టోబర్‌లో 20 వేల మంది తక్కువగా.. అంటే.. 12 లక్షల 70 వేల మందే ఈపీఎఫ్ఓలో చేరారు.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్‌లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!