NTV Telugu Site icon

India: 2075 నాటికి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

India

India

India to overtake US as world’s second largest economy by 2075: భారత్ 2075 నాటికి జపాన్, జర్మనీ, అమెరికాలను అధిగమించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్ తన నివేదికలో పేర్కొంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. గోల్డ్‌మన్ సాక్స్ నివేదిక ప్రకారం, అనుకూలమైన జనాభా, ఆవిష్కరణలు, సాంకేతికత, అధిక మూలధన పెట్టుబడి, కార్మికుల ఉత్పాదకత పెరగడం వంటివి ఈ అంచనాను నడిపించే అంశాలు. “రాబోయే రెండు దశాబ్దాలలో, భారతదేశం డిపెండెన్సీ నిష్పత్తి ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో అత్యల్పంగా ఉంటుంది” అని నివేదిక పేర్కొంది.

Also Read: MadyaPradesh Victim: మధ్యప్రదేశ్‌ మూత్రవిసర్జన ఘటనలో ట్విస్ట్.. సీఎం కాళ్లు కడిగిన వ్యక్తి బాధితుడు కాదంట?

గోల్డ్‌మన్ సాక్స్ రీసెర్చ్ భారతదేశ ఆర్థికవేత్త సంతను సేన్‌గుప్తా ప్రకారం, ఆవిష్కరణలు, కార్మికుల ఉత్పాదకతను పెంచడం, మూలధన పెట్టుబడులు కూడా వృద్ధికి గణనీయమైన చోదకశక్తిగా ఉండబోతున్నాయి. “ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణ, కార్మికుల ఉత్పాదకతను పెంచడం చాలా ముఖ్యమైనవి. సాంకేతిక పరిభాషలో చెప్పాలంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కార్మిక శక్తి, మూలధనం ప్రతి యూనిట్‌కు ఎక్కువ ఉత్పత్తి అని అర్థం” అని సంతను సేన్‌గుప్తా అన్నారు.

పెరుగుతున్న ఆదాయాలు, లోతైన ఆర్థిక రంగ అభివృద్ధితో భారతదేశ పొదుపు రేటు పెరిగే అవకాశం ఉంది. ఇది మరింత పెట్టుబడిని నడపడానికి మూలధన సమూహాన్ని అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని అన్నారాయన. ముఖ్యంగా రోడ్లు, రైల్వేల ఏర్పాటులో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని నివేదిక పేర్కొంది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పెరగకపోతే భారతదేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ప్రతికూల ప్రమాదం అని నివేదిక పేర్కొంది. “భారతదేశంలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు గత 15 సంవత్సరాలుగా క్షీణించింది” అని నివేదిక పేర్కొంది, శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్య రేటు పురుషుల కంటే గణనీయంగా తక్కువగా ఉంది.