MadyaPradesh Victim: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న మూత్రవిసర్జన ఘటనలో ట్విస్ట్ నెలకొంది. ఘటన జరిగిన తరువాత ఇన్ని రోజులకు విషయం బయటికి పొక్కడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మూత్ర విసర్జన ఘటనలో సీఎం కాళ్లు కడిగిన వ్యక్తి నిజమైన బాధితుడు కాదని.. తనను బలవంతంగా ఒప్పించారని బాధితుడు చెప్పాడు. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని సిదీలో ఆదివాసీ యువకుడిపై భాజపా నేత ఒకరు మూత్ర విసర్జన చేసిన ఘటన వ్యవహారం దేశవ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఘటన కొత్త మలుపు తిరిగింది.
Read also: TS Rains: నైరుతి బంగాళాఖాతంలో మరో ఆవర్తనం.. తెలంగాణకు భారీ వర్షసూచన
మధ్యప్రదేశ్‌లోని సిదీలో ఆదివాసీ యువకుడిపై భాజపా నేత ఒకరు మూత్ర విసర్జన చేసిన ఘటనకు సంబంధించిన వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఘటన జరిగిన తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ బాధితుడిని తన నివాసానికి పిలిపించి స్వయంగా అతడి కాళ్లు కడిగి క్షమాపణ కోరిన విషయం తెలిసిందే. అయితే తాను అసలైన బాధితుడిని కాదని.. ఆ వీడియోలో ఉన్న వ్యక్తిని తాను కాదంటూ సీఎంతో కాళ్లు కడిగించుకున్న దశమత్ రావత్ పేర్కొన్నారు. మూత్ర విసర్జన చేసిన నిందితుడు ప్రవేశ్ శుక్లా తనతో బలవంతంగా సంతకం చేయించారని దశమత్ పేర్కొనడం గమనార్హం. నిజమైన బాధితుడి కాళ్లు కడగకుండా సీఎం నాటకమాడారంటూ కాంగ్రెస్ జరిగిన ఘటనను ట్వీట్ చేసి.. బీజేపీని విమర్శించింది.