Site icon NTV Telugu

India- Pakistan: భారత్‌కు రానున్న పాకిస్థాన్ జట్టు.. క్రీడా మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్..!

India Vs Pakistan Records

India Vs Pakistan Records

పురుషుల ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌ 2025కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలు బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరుగుతాయి. ఈ టోర్నమెంట్​లో ఆగస్టు 27న ప్రారంభమై సెప్టెంబర్ 7న ముగుస్తుంది. అయితే.. భారత్‌లో జరిగే పురుషుల ఆసియా కప్‌ హాకీ టోర్నమెంట్‌లో పాకిస్థాన్‌ పాల్గొనడంపై చర్చ జరిగింది. పహల్గాంలో ఉగ్రదాడి తదనంతరం.. భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ జట్టుకు భారత్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

READ MORE: RK Roja: కూటమి గెలుపుపై రోజా సంచలన వ్యాఖ్యలు.. ఈవీఎం మాయాజాలం తోడై..!

ఈ అంశంపై గురువారం క్రీడా మంత్రిత్వ శాఖలో ఓ అధికారి కీలక సమాచారం అందించారు. భారత్‌లో ఏ అంతర్జాతీయ టోర్నమెంట్‌ జరిగినా.. తాము వ్యతిరేకం కాదని.. కానీ ద్వైపాక్షిక మ్యాచ్‌లు (భారతదేశం – పాకిస్థాన్ మధ్య మాత్రమే) విషయంలో వేరేగా వ్యవహరిస్తామని వెల్లడించారు. . ‘భారత్​లో ఏ టోర్నమెంట్​లోనైనా ఆడేందుకు ఏ జట్టుకూ మేం వ్యతిరేకం కాదు. కానీ, ద్వైపాక్షిక సిరీస్​ల్లో మాత్రం మా వైఖరి వేరుగా ఉంటుంది’ అని ఆ అధికారి స్పష్టం చేశారు. పాకిస్థాన్ జట్టు భారత పర్యటనకు సంబంధించి హాకీ ఇండియా కార్యదర్శి భోలా నాథ్ సింగ్ స్పందించారు. తాము ప్రభుత్వ సూచనల మేరకు పనిచేస్తామని.. ప్రభుత్వం ఏ నిర్ణయిం తీసుకున్నా.. అదే మా వైఖరి అవుతుందని స్పష్టం చేశారు.

READ MORE: Pakistan: భారత్ దెబ్బతో చైనా ఆయుధాలను నమ్మలేకపోతున్న పాకిస్తాన్.. ఇప్పుడు ఏం చేస్తోందంటే..

Exit mobile version