NTV Telugu Site icon

India-Canada Row: 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని కెనడాకు భారత్ హెచ్చరిక!

India Canada Row

India Canada Row

India-Canada Row: భారత్‌- కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో భారత్‌ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కఠినమైన వైఖరిని తీసుకున్న భారత్.. కెనడా తన 41 మంది దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించాలని కోరింది. అక్టోబర్ 10లోగా 41 మంది దౌత్యవేత్తలను రీకాల్ చేయాలని కెనడాను భారత్ కోరినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటన తర్వాత రెండు దేశాల మధ్య వివాదం వెలుగులోకి వచ్చింది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత వారం ఒక ప్రకటన ఇచ్చారు. అయితే, భారతదేశం ఈ వాదనలను పూర్తిగా తిరస్కరించింది, వాటిని అసంబద్ధంగా పేర్కొంది. రాజకీయ దురుద్దేశంతో కెనడా ఈ ఆరోపణలు చేసినట్లు ఖండించింది.

Also Read: Supreme Court: చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ ప్రారంభం

అక్టోబర్ 10 తర్వాత దేశం విడిచి వెళ్లాల్సిందిగా కోరిన కెనడా దౌత్యవేత్తల అధికారాలను రద్దు చేస్తామని భారత్ బెదిరించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయని ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది.ఇండియాలో కెనడాకు చెందిన 62 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. మొత్తం కెనడా దౌత్యవేత్తల సంఖ్యను 41కి తగ్గించాలని భారత్ పేర్కొంది. అయితే ఈ విషయంపై భారత్, కెనడా విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఇంకా స్పందించలేదు. కెనడా మొదట భారతీయ దౌత్యవేత్తలపై హింస, బెదిరింపు వాతావరణాన్ని సృష్టించిందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. కెనడాలో సిక్కు వేర్పాటువాద గ్రూపుల ఉనికి భారత్‌ను నిరాశపరిచిందని ఆయన అన్నారు. అదే సమయంలో, కొన్ని రోజుల క్రితం, US విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో తన భేటీలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఘటన వెనుక బాధ్యులు బాధ్యత వహించాలని బ్లింకెన్ అన్నారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వాదనకు మద్దతుగా కెనడా ఇంకా ఎటువంటి బహిరంగ సాక్ష్యాలను అందించకపోవడం గమనార్హం.

Show comments