Hybrid RPA Drones: భారతదేశ రక్షణ వ్యవస్థలో కొత్త నిఘా నేత్రం జత కానుంది. ఇప్పటి వరకు అవలంభిస్తున్న సైనిక వ్యూహంలో భారత్ కొత్తగా ఆధునిక సాంకేతికతను జోడిస్తూ వ్యూహాలకు పదును పెడుతుంది. అందులో భాగంగానే సూపర్ డ్రోన్‌లను సైన్యంలో భాగం చేస్తుంది. ఈ కొత్త డ్రోన్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక శత్రుదేశాలకు నిద్రపట్టదు. ఈ ‘సూపర్ డ్రోన్’ సరిహద్దుల్లో 24 గంటల నిరంతర నిఘా, అధిక కచ్చితమైన లక్ష్యం, సంక్షోభ సమయంలో వేగంగా ప్రతిస్పందనను కలిగి ఉన్నాయి. వీటితో ఇప్పుడు సైనిక వ్యూహం సైనికులు, బంకర్లకు మాత్రమే పరిమితం కాకుండా సాంకేతికత ఆధారితంగా మారనుంది. 15 ఏళ్ల రక్షణ ఆధునీకరణ రోడ్‌మ్యాప్‌లో భాగంగా కేంద్ర సర్కార్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
READ ALSO: Telanagana : ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై తెలంగాణ ప్రైవేట్ కాలేజీల బంద్, ఇబ్బందుల్లో విద్యార్థులు.
20 వేల అడుగుల ఎత్తులో నిఘా..
వైమానిక దళం కోసం ఎంపిక చేయనున్న హైబ్రిడ్ RPA (రిమోట్-ఫైలటెడ్ ఎయిర్‌క్రాఫ్ట్) ఫిక్స్‌డ్-వింగ్, రోటరీ-వింగ్ టెక్నాలజీల కలయికతో తయారు కానుంది. వీటితో ప్రధాన ప్రయోజనం ఏమిటంటే.. ఇవి 20 వేల అడుగుల ఎత్తు వరకు ఎగరగలవు. అలాగే వీటితో స్థిరమైన నిఘా, అవసరానికి అనుగుణంగా వెంటనే తక్కువ స్థాయికి కూడా దిగగలవు. ప్రస్తుతం వైమానిక దళానికి ప్రారంభంలో 10 – 20 హైబ్రిడ్ RPAలు అవసరమని అధికారులు చెబుతున్నారు. వీటిలో మీడియం రేంజ్ ఎత్తు, దీర్ఘ విమాన (MALE) డ్రోన్లు 30 – 40 వేల అడుగుల వరకు పనిచేయగలవు. అలాగే 24 గంటలకు పైగా గాలిలో ఉండటం ద్వారా నిరంతర కవరేజీని ఇవి అందిచనున్నాయి.
కొనుగోలు ఉద్దేశ్యం ఏమిటంటే..
ఈ కొనుగోలు ప్రక్రియ మేక్ – ఇన్ – ఇండియాలో భాగంగా చేపడుతున్నట్లు సమాచారం. అలాగే దేశంలోనే ఆయుధాలతో కూడిన డ్రోన్‌లను తయారు చేయాల్సిన సమయం ఆసన్నమైందని తెలియజేసేదిగా భావిస్తున్నారు. ఆధునిక యుద్ధంలో డ్రోన్‌ల పాత్ర చాలా కీలకంగా మారింది. ఇవి శత్రువుల కదలికలపై నిరంతర నిఘాతో పాటు, లక్ష్యంగా చేసుకున్న దాడులను కచ్చితంగా చేస్తాయి. అలాగే తక్కువ ప్రమాదంలో భారీ నష్టాన్ని కలిగించడంలో విశేషంగా సహాయపడతాయి. పాకిస్థాన్ – చైనా వంటి సరిహద్దుల్లో ఈ డ్రోన్‌లు దేశ బలాన్ని పెంచుతాయని రక్షణ శాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
READ ALSO: Donald Trump: ఇజ్రాయెల్‌పై ట్రంప్ ఫైర్.. ఖతార్‌తో జాగ్రత్త అంటూ హెచ్చరిక