NTV Telugu Site icon

AUS vs IND :టెస్టులో భారత్‌ ఘోర పరాజయం.. టీమిండియా టాప్‌ ప్లేస్ లాక్కున్న ఆస్ట్రేలియా

Aus Vs Ind

Aus Vs Ind

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. అడిలైడ్ టెస్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్లపై భారీ ప్రభావం చూపింది. భారత్ నుంచి నంబర్-1 టాప్‌ ప్లేస్‌ను కంగారూలు కొల్లగొట్టారు. ఆస్ట్రేలియా 60.71 శాతం మార్కులతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో టీమిండియా భారీ నష్టాన్ని చవిచూసింది. ఈ ఓటమితో రోహిత్ శర్మ అండ్ బ్రిగేడ్ 57.29 శాతం మార్కులతో మూడో స్థానానికి పడిపోయింది. 59.26 శాతం మార్కులతో దక్షిణాఫ్రికా రెండో స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య రెండో టెస్టు జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో కూడా గెలిస్తే ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి WTC పాయింట్ల పట్టికలో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది.

READ MORE: Srinivas Reddy: రాష్ట్రంలో అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది: శ్రీనివాసరెడ్డి

128/5తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 175 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ సెంచరీతో ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగుల ఆధిక్యం సాధించింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 175 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియాకు 19 పరుగుల లక్ష్యం లభించింది. ఆతిథ్య జట్టు 3.2 ఓవర్లలో సాధించి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 1-1తో డ్రా చేసుకుంది. మూడో మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్‌లో జరగనుంది.

READ MORE: E.car : ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో బూమ్ తెచ్చే కంపెనీలు ఏం చేస్తున్నాయి?