Site icon NTV Telugu

Ind vs Ban: బంగ్లా లక్ష్యం 513.. పుజారా, గిల్ శతకాలు

Ind Vs Ban

Ind Vs Ban

Ind vs Ban: ఛట్టోగ్రామ్‌లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు భారత్‌ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(110), టెస్ట్‌ స్పెషలిస్ట్‌ ఛతేశ్వర్ పుజారా(102*) సెంచరీలు సాధించారు. శుభమన్‌ గిల్‌కు ఇది తొలి సెంచరీ కాగా.. పుజారా నాలుగేళ్ల అనంతరం శతకం బాదాడు. కేఎల్‌ రాహుల్‌ 23, విరాట్ కోహ్లీ 19* పరుగులు చేశారు.

Avatar 2: అవతార్ నచ్చలేదని చెప్తే ఊరుకోరు.. పవన్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు

అంతకముందు టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ముష్పికర్‌ రహీమ్‌ 28 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ ఐదు వికెట్లు తీయగా.. సిరాజ్‌ 3, ఉమేశ్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌లు చెరొక వికెట్‌ తీశారు. ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులకు ఆలౌట్‌ అయిన సంగతి తెలిసిందే. లక్ష్యం 500 పరుగులకు పైగా ఉండడంతో, బంగ్లాదేశ్ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప ఈ మ్యాచ్ లో టీమిండియా విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఆటకు మరో రెండ్రోజుల సమయం ఉండడంతో బంగ్లాదేశ్ బ్యాటర్లు 200 ఓవర్లు ఆడేది అనుమానమే.

Exit mobile version