ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు చెక్.. సిరీస్‌తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 Rankings: జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో ఘనవిజయంతో పాటు, టీ20 ర్యాంకింగ్స్‌లో మళ్లీ నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుని భారత్ సత్తా చాటింది. ఈ నెల మొదట్లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్ ఓటమితో అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా, జింబాబ్వేపై 90 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి.. ఇంగ్లాండ్‌ను అధిగమించింది. ఇక, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రపీఠాన్ని దక్కించుకుంది. ఇషాన్ కిషన్, తిలక్ వర్మల విధ్వంసకర హాఫ్ సెంచరీలకు తోడు బౌలర్లు కట్టుదిట్టంగా రాణించడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ మరొక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. ఈ విజయం వరుసగా ఐర్లాండ్ (0-2), ఇంగ్లాండ్ (0-4) సిరీస్ ఓటములతో ఒత్తిడిలో ఉన్న కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలి 29 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ దశలో ఇషాన్ కిషన్ (81), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25)తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగులు, ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి నాలుగో వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఇషాన్ 31 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేయగా, ఆ తర్వాతి 13 బంతుల్లోనే ఏకంగా 31 పరుగులు రాబట్టడం విశేషం. మిడ్-వికెట్ మీదుగా అతను బాదిన సిక్సర్లు, ఫోర్లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. మరోవైపు స్ట్రైక్ రేట్‌పై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ తిలక్ వర్మ కేవలం 23 బంతుల్లోనే మెరుపు అర్ధసెంచరీ బాది అజేయంగా 60 పరుగులు చేయడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Also Read
220 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే, బ్రియన్ బెన్నెట్ (32) ధాటిగా ఆడటంతో వేగంగానే ఛేజింగ్ ప్రారంభించింది. అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో బెన్నెట్ ఫోర్, సిక్స్ బాదినప్పటికీ.. తదుపరి బంతికే కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. ఆ తర్వాత యశ్ ఠాకూర్ (2/30) వికెట్ల ఖాతా తెరవడంతో జింబాబ్వే పతనం ప్రారంభమైంది. తొమ్మిది ఓవర్ల లోపే 5 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు కోలుకోలేకపోయింది. ర్యాన్ బర్ల్, తదివనాశె మరుమాని చెరో 20 పైచిలుకు పరుగులు చేసి కాసేపు నిరోధించినా, భారత బౌలింగ్ ధాటికి నిలవలేకపోయారు. పార్ట్‌టైమ్ బౌలర్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ (3/17) కూడా వికెట్లు పడగొట్టడంతో జింబాబ్వే 129 పరుగులకే కుప్పకూలింది.
తాజావార్తలు
-
ICC T20 Rankings: ఇంగ్లాండ్‌కు చెక్.. సిరీస్‌తో పాటు ఐసీసీ అగ్రపీఠం దక్కించుకున్న టీమిండియా..
-
RC17 Update: RC17పై బిగ్ అప్డేట్.. స్క్రిప్ట్ లాక్ చేసిన సుకుమార్.. షూటింగ్ ఎప్పటి నుంచంటే?
-
Prahlad Joshi: ప్రధాని నమ్మకానికి కృతజ్ఞతలు.. బాధ్యతాయుతంగా పనిచేస్తా..
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి డబ్బే డబ్బు!
-
Prahlad Joshi: ఐదుసార్లు ఎంపీగా ఎన్నికై మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు.. ప్రహ్లాద్ జోషి రాజకీయ ప్రస్థానం
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!