Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pan India Star: ఒకప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ను బట్టి వారికి ప్రత్యేకమైన ట్యాగ్స్ ఉండేవి. మెగాస్టార్, సూపర్‌స్టార్, రెబల్‌స్టార్, పవర్‌స్టార్ వంటి బిరుదులు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ను తీసుకొచ్చేవి. అయితే ఇప్పుడు ఇండియన్ సినిమా పరిధి విస్తరించడంతో ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ చాలా కామన్‌గా మారిపోయింది. దీంతో సినీ అభిమానుల్లో ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న మొదలైంది. పాన్ ఇండియా స్టార్ తర్వాత హీరోకు దక్కే తదుపరి స్థాయి ఏంటి? ప్రస్తుతం స్టార్ హీరోలు తమ సినిమాలను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయడంతో పాటు ఓవర్సీస్ మార్కెట్లపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ‘గ్లోబల్ స్టార్’, ‘ఇంటర్నేషనల్ స్టార్’ వంటి ట్యాగ్స్ తెరపైకి వస్తున్నాయి. అయితే కేవలం ఒక చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం వల్ల ఆ స్థాయి గుర్తింపు రాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో సినిమాకి, నటుడికి ప్రత్యేక గుర్తింపు రావాలంటే, దానికి పలు అంశాలు కీలకంగా మారతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లలో మూవీకి లభించే రెస్పాన్స్, కలెక్షన్లు, వివిధ దేశాల్లో ప్రేక్షకుల ఆదరణ, అక్కడి మీడియా, సినీ వర్గాల్లో ఏర్పడే ప్రభావం వంటివి హీరో రేంజ్‌ను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు. ఒకటి రెండు సినిమాల సక్సెస్ కాకుండా.. వరుస చిత్రాలతో భాషా సరిహద్దులు దాటి సినిమా ప్రభావాన్ని చూపినప్పుడే నిజమైన గ్లోబల్ ఇమేజ్ ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే స్టార్ హీరోలకు కొత్త బిరుదులు పెట్టడం అభిమానులకు ఎంత ఆసక్తికరంగా ఉన్నా.. చివరకు ఆ ట్యాగ్‌ను నిర్ణయించేది ప్రేక్షకులే అని పేర్కొన్నారు. మార్కెట్‌ను పెంచేది, కొత్త ప్రాంతాల్లో అభిమానులను సంపాదించేది సినిమాలే అని, అందుకే ‘పాన్ ఇండియా’ తర్వాత ఏ పేరు వచ్చినా.. దానికి విలువ తెచ్చేది మాత్రం హీరో ఎంచుకునే కథలు, వాటి విజయాలు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే అని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ నెక్ట్స్ లెవల్ స్టార్‌డమ్‌పై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!