NTV Telugu Site icon

IND vs NZ: చెలరేగిన కోహ్లీ, శ్రేయస్.. న్యూజిలాండ్‌ లక్ష్యం@398

Ind Vs Nz

Ind Vs Nz

IND vs NZ: టీమిండియా స్టార్‌ బ్యాటర్లు చెలరేగి ఆడడంతో భారత్‌ భారీ స్కోరును సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ(117), శ్రేయస్ అయ్యర్‌(105) శతకాలతో అదరగొట్టారు. శుభమన్‌ గిల్‌(80), రోహిత్ శర్మ(47) రాణించడంతో న్యూజిలాండ్‌ ముంగిట 398 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ఉంచగలిగింది. చివరలో కేఎల్ రాహుల్ 20 బంతుల్లో 39 పరుగులతో రాణించాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో టిమ్ సౌథీ 3 వికెట్లు పడగొట్టి 100 పరుగులు సమర్పించగా.. బౌల్ట్ ఒక వికెట్‌ తీశాడు.

Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన కింగ్ కోహ్లీ.. 50 సెంచరీలతో సచిన్ రికార్డు బ్రేక్

ఈ మ్యాచ్‌లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం ద్వారా విరాట్ కోహ్లీ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలతో సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా విరాట్ నిలిచాడు. న్యూజిలాండ్ పై సెంచరీ తో వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు కోహ్లీ. 49 సెంచరీలు చేసిన సచిన్ రికార్డ్‌ని కోహ్లీ బ్రేక్ చేశాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలను సమం చేశాడు. న్యూజిలాండ్‌పై సెంచరీ చేయడం ద్వారా, వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో రోహిత్ 31 సెంచరీలు చేశాడు.

Also Read: Visakhapatnam: 101 సంవత్సరాల వయసులో 3 స్వర్ణ పథకాలను సాధించిన విశాఖ వాసి..

శ్రేయస్‌ అయ్యర్‌ కూడా బ్యాట్‌ను ఝులిపించి భారత్‌ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 67 బంతుల్లోనే సెంచరీ బాది భారత్‌కు భారీ స్కోరును కట్టబెట్టాడు. శ్రేయస్‌ 70 బంతుల్లో 8 సిక్సర్లు, 4 ఫోర్లతో 105 పరుగులు చేసి వెనుదిరగగా.. అనంతరం వచ్చిన కేఎల్‌ రాహుల్‌(39) కూడా వీరబాదుడు బాదాడు. గత ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌పై సెమీస్‌లో ఓడిపోయిన భారత జట్టు.. ఈ సారి ప్రతీకారం తీర్చుకుంటుందో వేచి చూడాల్సిందే.