NTV Telugu Site icon

Modi-Zelensky: మూడోసారి జెలెన్స్కీతో మోడీ భేటి.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగుతుందా?

Modi

Modi

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ప్రధాని మోడీ మూడు నెలల వ్యవధిలో మూడోసారి భేటీ అయ్యారు. అమెరికా పర్యటన నుంచి తిరిగి వస్తుండగా.. సోమవారం న్యూయార్క్‌లో ప్రధాని మోడీ, జెలెన్స్కీ మధ్య సమావేశం జరిగింది. ఇద్దరి మధ్య దాదాపు 45 నిమిషాల పాటు సంభాషణ సాగిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. ఈ విషయంపై తాను చాలా మంది ప్రపంచ నాయకులతో మాట్లాడానని.. యుద్ధాన్ని ముగించడానికి ఏదో ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉందని అందరూ అంగీకరించారని మోడీ జెలెన్స్కీకి చెప్పినట్లు తెలిపారు. ఇందుకోసం తమ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయన్నారు.

READ MORE: Delhi: కొత్త ఫోన్ కొన్నందుకు ట్రీట్ ఇవ్వలేదని స్నేహితుడు హత్య

ఉక్రెయిన్ అభ్యర్థనపై జెలెన్స్కీతో భేటీ అనంతరం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ కోరిక మేరకు ఈ సమావేశం జరిగిందని చెప్పారు. మోడీ గత నెలలో కీవ్‌లో ఉక్రెయిన్ నాయకుడిని కలిశారు. దానికి కొన్ని వారాల ముందు జూలైలో, ప్రధానమంత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను మాస్కోలో కలిశారు. చర్చలు, దౌత్యం ద్వారా శాంతికి మార్గాన్ని కనుగొనేందుకు ఎప్పుడూ మా మద్దతు ఉంటుందని మిస్రీ తెలిపారు.

READ MORE:AP Govt: వివిధ కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం

జెలెన్స్‌కీతో జరిగిన సమావేశంలో కూడా తాను ఎప్పుడూ శాంతి, శాంతి మార్గంలో నడవడం గురించే మాట్లాడినట్లు విక్రమ్‌ మిస్రీ చెప్పారు. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉన్నందున శాంతి లేకపోతే సుస్థిరమైన అభివృద్ధి ఉండదని స్పష్టమవుతోందని మిస్రీ అన్నారు. వివాదాన్ని ముగించే మార్గాన్ని కనుగొనడంపై అందరి ప్రయత్నాలు కేంద్రీకృతమై ఉన్నందున యుద్ధం ముగుస్తుందో లేదో కాలమే చెబుతుందన్నారు. రష్యా చమురు దిగుమతులు తన యుద్ధ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించినవి కాదన్న భారత్ వాదనను అంగీకరించారా అని అడిగిన ప్రశ్నకు.. మిస్రీ స్పందిస్తూ.. నేటి చర్చల్లో ఆ అంశం ప్రస్తావనకు రాలేదన్నారు.

READ MORE:UP News: వీడు కొడుకేనా..? తల్లిపై అత్యాచారం, భార్యగా ఉండాలంటూ బలవంతం.. జీవిత ఖైదు విధించిన కోర్టు..

మోడీ అమెరికా పర్యటన ముగిసిన అనంతరం ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కలిశానని రాశారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గత నెలలో నా ఉక్రెయిన్ పర్యటన ఫలితాలను అమలు చేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. గత నెలలో కీవ్‌లో తన పర్యటన, ద్వైపాక్షిక అంశాలు, రష్యా-ఉక్రెయిన్ వివాదానికి సంబంధించిన అన్ని విషయాలపై జరిపిన చర్చలను మోడీ ప్రస్తావించారు.