NTV Telugu Site icon

Brian Lara: రోహిత్-కోహ్లీ ఓపెనింగ్ జోడీని కొనసాగించాలి..

Brian Lara

Brian Lara

టీ20 ప్రపంచ కప్‌లో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ అనుకున్నంత స్థాయిలో ప్రదర్శన చూపించలేకపోతున్నారు. అయినప్పటికీ.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ఓపెనింగ్ జోడీని భారత్ కొనసాగించాలని లెజెండరీ వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో సింగిల్‌ డిజిట్‌కే (1, 4, 0) పరిమితమయ్యాడు. మరోవైపు.. రోహిత్ ఐర్లాండ్‌పై హాఫ్ సెంచరీతో రాణించాడు.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో 13, 3 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. వీరిద్దరూ తక్కువ స్కోర్లు చేసినప్పటికీ.. ఈ జోడీ మాత్రమే ఓపెనింగ్ చేయాలని లారా సూచించారు.

Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు

“భారత్‌కు ఎడమ-కుడి ఓపెనింగ్ భాగస్వామ్యం చేయగలే అవకాశం ఉంది. అయితే.. ఈ మెగా టోర్నీలో ఇద్దరు గొప్ప ఆటగాళ్లతో ఓపెనింగ్ కు వెళ్లారు. వీరిద్దరు ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శన చూపించారు. అయితే.. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆ తర్వాత ఆర్డర్ లో బ్యాటింగ్ కు వస్తే.. జట్టులో ఆట తీరుపై ప్రభావం చూపవచ్చు” అని స్టార్ స్పోర్ట్స్‌లో లారా పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు రాబోయే మ్యాచ్ల్లో పెద్ద స్కోరు చేయగలుగుతారని తెలిపారు. అమెరికాలో బ్యాటింగ్ పరిస్థితులు బాగా లేవు. అందుకోసమని భారత్ ఇప్పటి వరకూ ఆడిన 3 మ్యాచ్ల్లో గెలిచింది కావున.. మార్పులు చేయదని అనుకుంటున్నట్లు తెలిపారు.

Yediyurappa: పోక్సో కేసులో మాజీ సీఎం యడియూరప్పకి అరెస్ట్ వారెంట్ జారీ..

టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ సూపర్-8కు చేరింది. మిగిలిన ఏకైక బెర్తు కోసం అమెరికా, పాకిస్థాన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌లు ఆడిన అమెరికా.. రెండు విజయాలు సాధించి నాలుగు పాయింట్ల (+0.127 నెట్‌రన్‌రేట్)తో రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ మూడు మ్యాచ్‌లలో ఒకటి నెగ్గి.. రెండు పాయింట్ల (+0.191 నెట్‌రన్‌రేట్)తో మూడో స్థానంలో ఉంది. కెనడా, ఐర్లాండ్ జట్ల నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉండడంతో రేసులో లేవు. మరోవైపు.. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా కెనడాతో శనివారం ( జూన్ 15) సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడాలో తలపడనుంది.