NTV Telugu Site icon

Women’s T20 World Cup: హాఫ్ సెంచరీలు చేసిన స్మృతి, హర్మన్ ప్రీత్.. భారత్ భారీ స్కోర్

Ind W

Ind W

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 173 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు శుభారంభం చేసింది. మంధాన, షెఫాలీ తొలి వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 13వ ఓవర్‌లో ఇద్దరూ పెవిలియన్‌కు చేరుకున్నారు. మంధాన 38 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 50 పరుగులు చేసింది. ఆమె రనౌట్ అయింది. అనంతరం షెఫాలీ వర్మ 40 బంతుల్లో 43 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఆమె మూడో వికెట్‌కు జెమిమా రోడ్రిగ్స్ (16)తో కలిసి 30 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. 17వ ఓవర్లో జెమీమా వికెట్ కోల్పోయింది. నాలుగో వికెట్‌కు రిచా ఘోష్‌తో కలిసి హర్మన్ 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివరి రెండు బంతుల్లో ఫోర్లు బాది అర్ధ సెంచరీ పూర్తి చేసింది. 27 బంతుల్లో 52 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్ లో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉంది. రిచా 6 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు, కాంచన తలో వికెట్ తీశారు.