Site icon NTV Telugu

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై సంచలన విషయాలు.. నష్టాన్ని బయటపెట్టిన అధికారులు…!

Operation Sindoor

Operation Sindoor

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్‌కి చెందిన అనేక సైనిక, ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మే 6-7 రాత్రి నుంచి మే 10 వరకు భారత వైమానిక దళం (IAF) జరిపిన దాడుల్లో పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ దాడిలో పాకిస్థాన్‌కు చెందిన 6 పీఏఎఫ్ యుద్ధ విమానాలు, 2 AWACS, 1 C-130 విమానం, 30 క్షిపణులు, అనేక డ్రోన్లు (UCAV)లు ధ్వంసమయ్యాయని ఆపరేషన్‌లో పాల్గొన్న వర్గాలు ఇండియా టుడేకు తెలిపాయి.

READ MORE: Food Poison : ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో ఫుడ్‌పాయిజన్‌.. ఒకరు మృతి.. 30 మందికి అస్వస్థత..

మూలాల ప్రకారం.. ఈ లక్ష్యాలన్నింటినీ సుదర్శన్ వైమానిక క్రూయిజ్ క్షిపణి, ఉపరితలం నుంచి గగనతల క్షిపణుల సహాయంతో ఛేదించారు. సుదర్శన్ క్షిపణి 300 కి.మీ దూరం నుంచి ఖచ్చితమైన దాడిని నిర్వహించింది. పాకిస్థాన్ భోలారి వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో స్వీడిష్ AEW&C విమానం (ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్) కూడా ధ్వంసమైంది. వైమానిక స్థావరంలో అనేక యుద్ధ విమానాలు ఉన్నాయి. అయితే, శిథిలాలను పాకిస్థాన్ తొలగించింది.

READ MORE: TTD : అలర్ట్.. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో జారీ చేసే టోకెన్ల కౌంటర్‌లో మార్పు..

పాకిస్థాన్ పై భార్ కేవలం వైమానిక ప్రయోగ క్రూయిజ్ క్షిపణులను మాత్రమే ఉపయోగించింది. ‘వింగ్ లూంగ్’ సిరీస్‌కు చెందిన అనేక మీడియం-ఎలిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ చైనీస్ డ్రోన్‌లు రాఫెల్, ఎస్-30 దాడులలో ధ్వంసమయ్యాయి. భారత్ చేతిలో ఓటమి అనంతరం పాక్ కాల్పుల విరమణ కోసం అభ్యర్థించింది. ఆ తర్వాత భారతదేశం కాల్పుల విరమణకు అంగీకరించింది. అయితే, భవిష్యత్తులో ఏదైనా దుర్మార్గపు చర్యకు పాల్పడితే మరిన్ని చర్యలు తీసుకుంటామని భారతదేశం పాకిస్థాన్‌ను హెచ్చరించింది.

Exit mobile version