India Missile Test: క్షిపణి పరీక్షకు భారత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అండమాన్ & నికోబార్ దీవుల చుట్టూ నవంబర్ 25 – 27 మధ్య క్షిపణి పరీక్ష జరగవచ్చని తాజాగా భారతదేశం NOTAM (నో-ఫ్లై జోన్ హెచ్చరిక) జారీ చేసింది. ఈ హెచ్చరిక ట్రై-సర్వీసెస్ థియేటర్ కమాండ్ కింద బంగాళాఖాతం ప్రాంతానికి వర్తిస్తుంది. ఈ నోటీసు ప్రకారం నో-ఫ్లై జోన్ గరిష్టంగా 490 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం అండమాన్ సముద్రం, మలక్కా జలసంధికి సమీపంలో వస్తుంది.
READ ALSO: Yamini Sharma-Rajamouli: రాజమౌళి గారూ దేవుడు కమర్షియల్ కాదు.. యామిని శర్మ ఆగ్రహం!
నవంబర్ 25వ తేదీన తెల్లవారుజామున 3:30 గంటల నుంచి నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ NOTAM (నో-ఫ్లై జోన్ హెచ్చరిక) అమలులో ఉంటుంది. ఈ కాలంలో ఈ ప్రాంతంలో విమానాల రాకపోకలు పరిమితం చేయబడతాయి. భారత సైన్యం నిర్వహించే ముఖ్యమైన క్షిపణి పరీక్షకు ఇది సన్నాహకంగా ఉంటుందని సమాచారం. అండమాన్ & నికోబార్ ప్రాంతం భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ఇక్కడి నుంచి భారతదేశం ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తుంది.
NOTAM అంటే ..
NOTAM అంటే ఎయిర్ మిషన్లకు నోటీసు. ఇది అంతర్జాతీయ, దేశీయ విమానాలను ఏవైనా మార్పులు, ప్రమాదాలు, పరిమితులు లేదా సాంకేతిక సమాచారం గురించి అప్రమత్తం చేసే అధికారిక నోటీసు. విమానాశ్రయంలో తాత్కాలిక మార్పులు ఉన్నప్పుడు, వివిధ పరిస్థితులలో NOTAMలు జారీ చేస్తారు. ఉదాహరణకు రన్‌వే మరమ్మతులు, టాక్సీవే మూసివేతలు, రన్‌వే లైటింగ్ వైఫల్యాలు వంటివి ఉన్నప్పుడు ఈ నోటీ సుజారీ చేస్తారు. దట్టమైన పొగమంచు, తుఫానులు, తగ్గిన దృశ్యమానత వంటి తీవ్రమైన వాతావరణ పరిస్థితులప్పుడు కూడా NOTAM లు జారీ చేస్తారు. VVIP ల కదలికలు, గగనతలంలో తాత్కాలిక నో-ఫ్లై జోన్లు, సైనిక వ్యాయామాలు (కాల్పులు, క్షిపణి పరీక్షలు), నావిగేషన్ సిస్టమ్ సమస్యలకు ప్రతిస్పందనగా, భద్రతా కారణాల దృష్ట్యా కూడా NOTAM లు జారీ చేస్తారు.
READ ALSO: Delhi Car Blast Case: ఢిల్లీ కారు బ్లాస్ట్ కేసులో మరో నలుగురు కీలక నిందితుల అరెస్ట్ ..