Missile test: బంగాళాఖాతం ప్రాంతంలో భారత్ ‘‘నో-ఫ్లై’’ జోన్ నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6-8 మధ్య క్షిపణి పరీక్ష నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది. 1,480 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న నో-ఫ్లై జోన్ డిసెంబర్ 6న 12:30 UTC నుండి డిసెంబర్ 8న 15:30 UTC వరకు ఈ నో - ఫ్లై జోన్ ఉంటుందని ఉత్తర్వులు చెప్పాయి.
India Missile Test: క్షిపణి పరీక్షకు భారత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అండమాన్ & నికోబార్ దీవుల చుట్టూ నవంబర్ 25 – 27 మధ్య క్షిపణి పరీక్ష జరగవచ్చని తాజాగా భారతదేశం NOTAM (నో-ఫ్లై జోన్ హెచ్చరిక) జారీ చేసింది. ఈ హెచ్చరిక ట్రై-సర్వీసెస్ థియేటర్ కమాండ్ కింద బంగాళాఖాతం ప్రాంతానికి వర్తిస్తుంది. ఈ నోటీసు ప్రకారం నో-ఫ్లై జోన్ గరిష్టంగా 490 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఈ ప్రాంతం అండమాన్ సముద్రం,…