America: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ .. అమెరికా ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా మరోసారి భారత్ ను మెచ్చుకుంది. భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు. “భారతీయులు ఓటు వేయడంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం ప్రశంసనీయం. భారతదేశంలో 96 కోట్ల మంది ప్రజలు ఓటింగ్ ప్రక్రియలో భాగమవుతున్నారు. 2,660 గుర్తింపు పొందిన పార్టీల నుంచి అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. వేలాది మంది పోటీదారుల నుంచి 545 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకోబోతున్నారు’ అని తెలిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
READ MORE: Immigration Visas : అమెరికా వీసా కోసం ఆయుధాలతో దోపిడీకి ప్లాన్ చేసిన భారతీయులు
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో జరుగుతున్న ఎన్నికలను అమెరికా నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. బైడెన్ పరిపాలనలో గత మూడేళ్లలో ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో భారత్-అమెరికా సంబంధాలు బలోపేతం అయ్యాయని వివరించారు. భారత్‌తో తమ సంబంధం చాలా సన్నిహితంగా ఉందని, మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. ప్రధాని మోడీతో స్నేహాన్ని మరింతగా పెంచుకోవాలని బైడెన్ భావిస్తున్నట్టు స్పష్టం చేశారు. క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఇరు దేశాలు కలిసి పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇండో-పసిఫిక్ క్వాడ్‌ను విస్తరించి రెండు దేశాల సైన్యాలు కూడా అనేక యుద్ధ విన్యాసాలలో పాల్గొన్నాయని గుర్తు చేశారు. మోడీ నాయకత్వంపై ఎంతో కృతజ్ఞతతో ఉంటామని పేర్కొన్నారు. ఇప్పటికే భారతదేశ విధానాలను అమెరికా ఎప్పటికప్పుడు పొగుడుతూనే ఉంది.
- Tags
- america
- Bharath
- bjp
- country
- In The World
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్‌కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!