NTV Telugu Site icon

India vs Ireland: బ్యాడ్ న్యూస్.. భారత్-ఐర్లాండ్ తొలి టీ20కి వరుణుడు అడ్డంకి..?

Ind

Ind

భారత్, ఐర్లాండ్ మధ్య జరిగే తొలి టీ20 మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు టీ20ల సిరీస్ లో భాగంగా.. తొలి మ్యాచ్ డబ్లిన్ లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 7.30 గంటలకు భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నప్పటికీ.. డబ్లిన్ లో వాతావరణ పరిస్థితులు బాగాలేవు. వర్షం పడే సూచనలు భారీగా ఉన్నాయి. దాదాపు 90 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ వాతావరణం చల్లగా ఉంది.

Minister KTR: టాటా బిర్లా కాదు తాతల నాటి కుల వృత్తులు బాగుండాలి

డబ్లిన్ లో ఉష్ణోగ్రత దాదాపు 15 డిగ్రీల సెల్సియస్ ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. అంతే కాకుండా గంటకు 15-30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని పేర్కొంది. అంతేకాకుండా.. 6 మి.మీ వర్షం కురుస్తుంది. మ్యాచ్ సమయం వరకు వర్షం లేకుంటే.. మ్యాచ్ ప్రారంభం కానుందని చెబుతున్నారు. మరోవైపు వర్షం తగ్గి.. మ్యాచ్ ప్రారంభం అవుతుందనే ధీమాతో భారత్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. చూడాలి మరీ.. తొలి టీ20 మ్యాచ్ జరుగుతుందా.. వరణుడు అడ్డగిస్తాడా.

Rahul Gandhi: పరాభవం ఎదురైన చోటు నుంచే రాహుల్‌ పోటీ.. కాంగ్రెస్ ప్రకటన

ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. బుమ్రా తాజాగా కోలుకుని తొలి టీ20 మ్యాచ్ ఆడుతున్నాడు. అంతేకాకుండా కెప్టెన్ గా వ్యవహరిస్తుండటంతో.. అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

Balakrishna Fans: మాకేందిరా ఈ శిక్ష అంటున్న బాలయ్య ఫాన్స్

భారత జట్టు
జస్ప్రీత్ బుమ్రా (c), రితురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ (wk), జితేష్ శర్మ (wk), శివమ్ దూబే, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్, రవి బిష్ణోయ్ ప్రసిద్ కృష్ణ

ఐర్లాండ్ జట్టు
పాల్ స్టిర్లింగ్ (సి), లోర్కాన్ టక్కర్ (wk), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ క్యాంపర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఫియోన్ హ్యాండ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, హ్యారీ టెక్టర్, బెన్ వైట్, థియో వాన్ వూర్కోమ్, క్రైగ్ యువత