IND vs ENG: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. సుర్యకుమార్ వ్యూహం ఇదే..
- ముగిసిన టాస్
- టాస్ గెలిచిన భారత్
- ఫీల్డింగ్ ఎంచుకున్న సూర్యకుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ బుధవారం నుంచి ప్రారంభమైంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో తొలి టీ20 జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా.. భారత్, ఇంగ్లండ్‌లు చివరిసారిగా 2022లో టీ20 సిరీస్ ఆడాయి. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో భారత్ 2-1తో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. తాజాగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు కమాండ్ సూర్యకుమార్ యాదవ్ చేతిలో ఉండగా, ఇంగ్లండ్ పగ్గాలు జోస్ బట్లర్ చేతిలో ఉన్నాయి. ఈ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ చాలా కాలం తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడు. అతను నవంబర్ 2023లో భారత్ తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత షమీ మడమకు శస్త్రచికిత్స అయ్యింది.
READ MORE: Davos: ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, ఫడ్నవీస్..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
“ఇది మంచి మైదానం. భారత్‌తో ఆడడం గౌరవంగా భావిస్తున్నాను. అందరూ మంచి స్థానంలో ఉన్నారు. రెండు వైపులా క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ కలిగి ఉన్నారు. ఇది ఒక సవాలుగా ఉంటుంది. ఈ సవాలు కోసం మేము సిద్ధంగా ఉన్నాం.” అని జోస్ బట్లర్ అన్నాడు. “ముందుగా బౌలింగ్ చేయాలని చూశాం. ఎందుకంటే రాత్రి అవుతున్న కొద్ది మంచు కురుస్తుంది. అప్పుడు ఫీల్డింగ్‌కు ప్రాబ్లమ్ అవుతుంది. మా టీం అద్భుతంగా ఉంది. రెండు టీంల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ఈ సిరీస్ కైవసం చేసుకునేందుకు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.” అని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు.
READ MORE: Congress: దావోస్ వెళ్లని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం.. విభేదాలే కారణమని బీజేపీ ఆరోపణ..
కాగా.. 14 ఏళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 మ్యాచ్ జరగుతుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇప్పటివరకు భారత జట్టు మొత్తం 8 టీ20 మ్యాచ్‌లు ఆడగా, అందులో ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా ముగిసింది. ఈ గడ్డపై టీమిండియా ఓడిన ఏకైక మ్యాచ్ ఇంగ్లండ్‌తో మాత్రమే. 29 అక్టోబర్ 2011న ఈడెన్ గార్డెన్స్‌లో టీమ్ ఇండియా తన మొదటి టీ20 మ్యాచ్ ఆడింది. యాదృచ్ఛికంగా ఈ మ్యాచ్ ఇంగ్లండ్‌తో జరిగింది. ఈ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో భారత జట్టును ఓడించింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!