IND vs SA: వరల్డ్ కప్ 2023లో భాగంగా.. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 243 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ బౌలర్లు విజృంభించడంతో కేవలం 27.1 ఓవర్లలో 83 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లలో అత్యధికంగా రవీంద్ర జడేజా 5 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఆటగాళ్లను కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో భారత్.. వరల్డ్ కప్ లో ఆడిన 8 మ్యాచ్ ల్లో అన్నింటిలో గెలిచింది.
Read Also: Manchu Manoj: నేను ఆ పని చేస్తే.. ఆళ్లగడ్డ నుంచి బాంబ్ లు పడతాయి
ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. భారత్ బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ శతకంతో మెరువగా, శ్రేయాస్ అయ్యర్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఈ క్రమంలో టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు చెమటలు పట్టించారు. ఆరంభం నుంచే బౌలింగ్ విజృంభణతో విరుచుకుపడి క్రీజులోకి వచ్చిన వారు వచ్చినట్లుగా వెనక్కి పెవిలియన్ కు పంపించారు. టీమిండియా బౌలర్ల విజృంభణ ముందు సౌతాఫ్రికా బ్యాటర్లలో ఏ ఒక్కరూ 20 పరుగుల స్కోరు దాటలేదు.
Read Also: Virat Kohli: కల నెరవేరింది.. బర్త్ డే రోజున సంతోషంగా ఉంది..!
ఇక.. ఈ మ్యాచ్ లో స్పిన్నర్ రవీంద్ర జడేజా అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు సాధించగా.. స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 2 వికెట్లు సాధించాడు. మహ్మద్ సిరాజ్ కు ఒక వికెట్ దక్కింది. ఇక ఇండియా తర్వాతి మ్యాచ్ నెదర్లాండ్స్ తో ఆడనుంది.
