Raj Limbani: 7 వికెట్లతో చెలరేగిన రాజ్ లింబాని.. ఆసియాకప్ 2023 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India beat Nepal to enter U19 Asia Cup 2023 Semifinal: పేసర్ రాజ్ లింబాని (7/13) చెలరేగడంతో అండర్-19 ఆసియా కప్ 2023లో భారత యువ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గ్రూపు-ఏలో భాగంగా మంగళవారం నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూపు దశలో మూడు మ్యాచ్‌ల్లో రెండింట్లో నెగ్గిన భారత్ నాలుగు పాయింట్లతో సెమీస్ బెర్తు దక్కించుకుంది. ఆరంభ మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ను చిత్తుచేసిన భారత్.. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. రాజ్ లింబాని ధాటికి 22.1 ఓవర్లలో 52 పరుగులకే ఆలౌట్ అయింది. నిప్పులు చెరిగే బంతులతో నేపాల్ బ్యాటర్లను ఓ ఆటాడుకున్నాడు. రాజ్ బౌలింగ్ దాడికి నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. నేపాల్ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు అందుకోలేకపోయారు. భారత బౌలర్లు ఇచ్చిన అదనపు పరుగులే (13) అత్యధిక స్కోరు కావడం గమనార్హం. రాజ్ 9.1 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి.. 13 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ఆరాధ్య శుక్లా (2/31), అర్షిన్ కులకర్ణి (1/7) కూడా రాణించారు.
Also Read
- Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
Also Read: Rinku Singh Six: రింకూ సింగ్ పవర్‌ఫుల్ షాట్.. బాక్సులు బద్దలు! వీడియో వైరల్
అనంతరం భారత్ 7.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు ఆదర్శ్ సింగ్ (13 నాటౌట్; 13 బంతుల్లో 2×4), అర్షిన్ కులకర్ణి (43 నాటౌట్; 30 బంతుల్లో 1×4, 5×6) దంచేశారు. ఈ ఇద్దరు మొదటి వికెట్‌కు 57 పరుగులు జోడించి లక్ష్యాన్ని ఛేదించారు. ఇక పాకిస్తాన్ మంగళవారం అఫ్గనిస్తాన్‌ను 83 పరుగుల తేడాతో మట్టికరిపించి మూడో విజయం నమోదు చేసింది. దాంతో ఆడిన మూడు మ్యాచ్‌లను నెగ్గి గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!