Site icon NTV Telugu

ICC Rankings: మనల్ని ఎవర్రా ఆపేది.. ఐసీసీ ర్యాంకింగ్స్‎లో టాప్ లేపిన టీమిండియా స్టార్స్..!

Icc Rankings

Icc Rankings

ICC Rankings: భారత క్రికెట్ జట్టు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇక తాజా ర్యాంకింగ్స్ ప్రకారం.. ఐదుగురు భారత ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అగ్రస్థానాన్ని సంపాదించారు. భారత జట్టు ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌లోని అన్ని ఫార్మట్స్ లో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. టీమిండియా సుదీర్ఘ కాలంగా టెస్ట్, వన్డే, టీ20 క్రికెట్‌లో దూసుకెళ్లుతోంది. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవడంతో భారత క్రికెట్‌కు మరింత శక్తిని తీసుకొచ్చింది. మరి ఎవరెవరు ఏ ఫార్మాట్ లో టాప్ చేశారో చూద్దామా..

Panneerselvam: ఎన్డీఏకు గుడ్‌బై చెప్పిన పన్నీర్ సెల్వం.. స్టాలిన్‌ను కలిసిన తర్వాత ప్రకటన

భారత యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ టీ20 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సాధించారు. అతను ట్రావిస్ హెడ్‌ను అధికమించి 829 పాయింట్లతో మొదటి స్థానం పొందాడు. అభిషేక్ శర్మ గతంలో చేసిన ప్రదర్శనతో ఈ ఘనతను సాధించాడు. అలాగే వన్డే క్రికెట్‌లో బాట్స్మెన్స్ లిస్ట్ లో శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో నిలిచారు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను అధిగమించి 784 పాయింట్లతో నంబర్ 1 స్థానంలో నిలిచాడు. అతని వరుసగా మెరుగైన ప్రదర్శన వల్ల వన్డే క్రికెట్‌లో అతన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది..

AP Liquor Scam Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. ముంబైకి సిట్‌ టీమ్‌..

భారత టెస్ట్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. జడేజా తన బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనలతో ఈ ఘనతను సాధించాడు. అతను ప్రస్తుతం 422 పాయింట్లతో నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే మరోవైపు టీ20 ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. 252 పాయింట్లతో నంబర్ 1 స్థానంలో పాండ్య కొనసాగుతున్నాడు. బ్యాట్, బాల్ రెండింటితోనూ రాణించి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో టాప్ ప్లేస్ లో నిలిచారు. ఇక భారత బౌలింగ్ డిపార్ట్మెంట్ హెడ్ జస్‌ప్రీత్ బుమ్రా తన బెస్ట్ పెర్ఫార్మన్స్ తో టెస్ట్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచారు. 898 పాయింట్లతో ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు.

Exit mobile version