మన ఇండియాలో కరోనా మహమ్మారి కేసులు ఓ రోజు పెరుగుతూ…. ఓ రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే.. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 8,954 కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు దేశంలో 99,023 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య లక్ష లోపు దిగి రావడం శుభపరిణామం.
గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 267 మంది మృతి చెందారు. ఇక గడిచిన 24 గంటల్లో 10,207 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 4,69,247 మంది కరోనాతో మరణించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇక దేశంలో ఇప్పటి వరకు నమోదు అయిన కరోనా కేసుల సంఖ్య 3,45,96,776 గా నమోదు అయింది. మరోవైపు ఇండియాలో ఇప్పటి వరకు మొత్తం 124,10,86,850 మందికి టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది.