అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ 21.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీలంకను సులువుగా ఓడించిన భారత్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ విజయానికి హీరోలు వైభవ్ సూర్యవంశీ, చేతన్ శర్మ, ఆయుష్ మ్హత్రే. వైభవ్ 36 బంతుల్లో 67 పరుగులు చేయగా.. చేతన్ శర్మ 8 ఓవర్లలో 34 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. ఆయుష్ మ్హత్రే 10 ఓవర్లలో 37 పరుగులిచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.. అంతేకాకుండా.. 28 బంతుల్లో 34 పరుగులు కూడా చేశాడు. శ్రీలంక బౌలర్లలో విహాస్ థెవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ తీశారు.
Read Also: Post Office RD: ప్రతినెలా రూ. 5000 పెట్టుబడి.. మెచ్యూరిటీపై ఎనిమిది లక్షలకు పైగా పొందండి
మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. లంక బ్యాటర్లలో లక్విన్ అబెయ్‌సింఘే 69 పరుగులు.. షారుజన్ షణ్ముగనాథన్ 42 పరుగులతో మాత్రమే రాణించారు. మిగత బ్యాటర్లు పెద్దగా ఆడలేదు. భారత్ బౌలిగ్‌లో చేతన్ శర్మ 3 వికెట్లు.. కిరణ్ చొర్మాలే, ఆయుష్ మాత్రే చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆదివారం (డిసెంబర్ 8) దుబాయ్‌లో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
Read Also: Pushpa 2: రప రప మొదలైంది.. బాలీవుడ్ బద్దలైంది.. ఇంకెక్కడి ఖాన్లు?