అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఇండియా విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో.. భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.
అండర్-19 ఆసియాకప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణించారు. చేతన్ శర్మ, కిరణ్ చొర్మాలే, ఆయుష్ మాత్రేలు రాణించడంతో శ్రీలంక 46.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ యువ జట్టు ముందు 174 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. లంక బ్యాటర్లలో లక్విన్ అబెయ్‌సింఘే (69; 110 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ చేయగా.. షారుజన్ షణ్ముగనాథన్ (42; 78 బంతుల్లో 2 ఫోర్లు)…