ప్రపంచ కప్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడనుంది. భారత్ గడ్డపై ఈ సిరీస్ జరుగనుంది. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ ఎవరన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రపంచకప్ ముగిసిన తర్వాత ప్రధాన ఆటగాళ్లు కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ క్రమంలో టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సిరీస్ కు దూరంకానున్నాడు.
Read Also: NZ vs PAK: న్యూజిలాండ్-పాకిస్తాన్ మ్యాచ్కు వర్షం అడ్డంకి.. రద్దైతే ఆ జట్టుకే గెలుపు అవకాశం..!
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో సిరీస్ కు ఇప్పుడు టీమిండియా బాధ్యతలు ఎవరు చేపడుతారన్నది సస్పెన్స్ గా మారింది. ఓ పక్క రోహిత్ శర్మ ఆటడం లేదు, మరోపక్క వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కాలికి గాయం కారణంగా వరల్డ్ కప్ టోర్నీ నుంచే దూరమయ్యాడు. అయితే అతను పూర్తిగా కోలుకోవడానికి 6 వారాల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
‘ఇన్‌సైడ్‌స్పోర్ట్స్’ నివేదిక ప్రకారం.. ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌లో సూర్యకుమార్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తారనే ఒక ప్రణాళిక ఉంది. అయితే ప్రపంచ కప్ తర్వాత సూర్య కూడా విశ్రాంతి తీసుకోనున్నాడు. BCCI అధికారి మాట్లాడుతూ, “రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే ఆలోచన ఉందని.. హార్దిక్ ఈ సిరీస్కు దూరమైతే, సెలక్టర్లు రుతురాజ్కు కెప్టెన్సీని ఇచ్చే ఆలోచన చేయవచ్చన్నాడు. వచ్చే వారం హార్దిక్ ఫిట్‌నెస్‌ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. ఈ పరిస్థితిల్లో గైక్వాడ్ మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇటీవల ఆసియా క్రీడలలో గైక్వాడ్ టీమిండియాకు నాయకత్వం వహించాడు. అంతేకాకుండా.. అతని సారథ్యంలో జట్టు స్వర్ణం గెలుచుకుంది.