NTV Telugu Site icon

IND vs AUS: రేపు ఇండియా-ఆస్ట్రేలియా రెండో వన్డే.. ఆసీస్ జట్టులో మార్పులు

Ind Aus

Ind Aus

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా జట్టు.. ప్రధాన మార్పులతో రెండో వన్డే ఆడనుంది. రేపు (ఆదివారం) ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉందో తెలుసుకుందాం.

Read Also: Navdeep: నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు..

తొలి వన్డేలో ఆస్ట్రేలియా జట్టు బౌలింగ్ చాలా బలహీనంగా కనిపించింది. ఆసీస్ జట్టులో కేవలం ఒక ప్రధాన ఫాస్ట్ బౌలర్, ఒక ప్రధాన స్పిన్నర్‌తో మాత్రమే స్టేడియంలోకి దిగారు. మిగిలిన వారంతా ఆల్‌రౌండర్లే. దీంతో బౌలింగ్ విభాగం బలంగా లేకపోవడంతో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రెండో వన్డేలో టీమిండియాను కట్టడి చేసేందుకు బౌలింగ్ విభాగంలో మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి.

Read Also: Navdeep: నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు..

రెండో వన్డేలో భారత సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ తన్వీర్ సంఘా ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మాథ్యూ షార్ట్ ప్లేస్ లో సంఘాను ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా.. జోష్ హేజిల్‌వుడ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చే అవకాశాలున్నాయి. ఇక రెండో వన్డేలో కూడా.. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్ అందుబాటులో ఉండరని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపాడు. ఈ స్టార్ ఆటగాళ్లిద్దరూ మూడో వన్డేలో ఆడాలని భావిస్తున్నారు.

Show comments