India wheat To Afghanista: ఐక్యరాజ్యసమితి భాగస్వామ్యంతో, భారతదేశం ఆఫ్ఘనిస్తాన్‌కు 20 వేల మెట్రిక్ టన్నుల గోధుమల సాయాన్ని ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్పై భారత్-మధ్య ఆసియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశం తర్వాత సంయుక్త ప్రకటన విడుదలైంది. ఈ సహాయం కాబూల్‌కు పాకిస్తాన్ ద్వారా కాకుండా ఇరాన్‌లోని చబహార్ పోర్ట్ ద్వారా అందించబడుతుంది. తీవ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలో ఐదు మధ్య ఆసియా దేశాలు మంగళవారం చర్చించాయి. ఈ సమావేశానికి భారతదేశం, కజకిస్తాన్, కిర్గిజిస్థాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్ ప్రత్యేక రాయబారులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు. డ్రగ్స్ అండ్ క్రైమ్స్‌పై ఐక్యరాజ్యసమితి కార్యాలయానికి చెందిన దేశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
Read Also: Immoral Relationship : పోర్న్ వీడియో చూసిందని భార్యను చంపిన భర్త
ఈ సంప్రదింపుల్లో అధికారులు తీవ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, ప్రాంతీయ బెదిరింపులపై చర్చించారు. ఈ బెదిరింపులను ఎదుర్కోవడానికి సమన్వయ ప్రయత్నాల గురించి చర్చించారు. ఆఫ్ఘనిస్తాన్ భూమిని ఉగ్రవాద శిక్షణకు ఉపయోగించరాదని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్థాన్‌కు గోధుమల సాయాన్ని పాకిస్థాన్ ద్వారా కాకుండా ఇరాన్ ద్వారా పంపిస్తామని కూడా స్పష్టం చేశారు. ఈ సమావేశంలో, ఇరాన్‌లోని చబహార్ ఓడరేవు ద్వారా గోధుమలను సరఫరా చేస్తామని.. అదీ ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం భాగస్వామ్యంతో పని చేస్తామని భారత్ స్పష్టం చేసింది. ఇంతకుముందు, భారత్.. పాకిస్తాన్ నుండి రోడ్డు మార్గంలో దాదాపు 40,000 టన్నుల గోధుమలను రవాణా చేసింది. అయితే ఆ సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది.