India AI Impact Summit 2026: AI రంగంలో విశ్వగురువుగా భారత్! నేడే ప్రధాని మోదీ చేతుల మీదుగా ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India AI Impact Summit 2026: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో ప్రతిష్టాత్మకమైన “ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026” (India AI Impact Summit 2026) నేడు ప్రారంభం కానుంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ సదస్సుకు హాజరయ్యేందుకు వచ్చిన వివిధ దేశాల అధినేతలకు, ప్రతినిధులకు ప్రధాని మోదీ నిన్ననే సాదర స్వాగతం పలికారు. వారి గౌరవార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక డిన్నర్ పార్టీలో ప్రధాని పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో ఫ్రాన్స్ అధ్యక్షుడు, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ వంటి ప్రముఖ ప్రపంచ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు.
Also Read
- Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం... ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..
- NEET Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
- Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
- Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
సమ్మిట్ సందర్భంగా ప్రధాని బిజీ షెడ్యూల్ ఇలా ఉండబోతోంది:
* ఉదయం 9:40: భారత్ మండపంలో సమ్మిట్ ప్రారంభం.
* ఉదయం 11:00: ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026 సందర్శన. ప్రపంచ నాయకులతో కలిసి వివిధ దేశాల పెవిలియన్‌లను ప్రధాని వీక్షిస్తారు.
*మధ్యాహ్నం 12:00: ‘లీడర్స్ ప్లీనరీ’ సమావేశం. ఇందులో పాలన, మౌలిక సదుపాయాలు మరియు అంతర్జాతీయ సహకారం వంటి అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.
* సాయంత్రం 5:30: దిగ్గజ సంస్థల CEO లతో రౌండ్‌టేబుల్ సమావేశం. పెట్టుబడులు, పరిశోధన మరియు సరఫరా గొలుసు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు.
JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!
“సర్వజన హితాయ, సర్వజన సుఖాయ” అనే నినాదంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. మొత్తం 7 వర్కింగ్ గ్రూపులుగా విడిపోయి. ఆర్థిక వృద్ధి, సురక్షితమైన AI వినియోగం, సామాజిక సాధికారత, మానవ వనరుల అభివృద్ధి వంటి కీలక రంగాలపై ఈ సదస్సు ఫోకస్ పెట్టనుంది. ఈ సమ్మిట్ ప్రాముఖ్యతను చాటిచెబుతూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా ప్రతినిధులు తరలివచ్చారు. ఇందులో 20కి పైగా దేశాధినేతలు, 60కి పైగా విదేశీ మంత్రులు, 100కు పైగా ప్రభుత్వ ప్రతినిధులు, దాదాపు 100 మంది గ్లోబల్ CEOలు హాజరుకానున్నారు. 150 మంది ప్రముఖ AI పరిశోధకులు ఈ మేధోమథనంలో భాగస్వాములు కానున్నారు.
తాజావార్తలు
-
Hashmatullah Shahidi: భారత్‌పై కెప్టెన్ చారిత్రాత్మక శతకం… ఒంటరి పోరాటంతో సరికొత్త రికార్డు..
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
NEET Exam: నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో నీట్ సెంటర్.. అసలు నిజం ఇదే..
-
Railway Rules: టికెట్ లేని ప్రయాణంపై రైల్వే రూల్స్ చేంజ్.. ఇకపై డబుల్ పెనాల్టీ..
-
Maharashtra Temple Tragedy: పర్భణిలో విషాదం.. హనుమాన్ ఆలయ మండపం కూలి ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..