Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్-ఏ జట్టు నేపాల్‌పై 306 పరుగుల ఘన విజయంతో అద్భుత ఆరంభం చేసింది. దోహా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్-ఎ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేయగా, నేపాల్ జట్టు కేవలం 11.3 ఓవర్లలో 26 పరుగులకే ఆలౌటైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఏ 42 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర కలిసి జట్టును ఆదుకున్నారు.
వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. కుశాగ్ర 102 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 117 పరుగులు చేయగా, తిలక్ వర్మ 113 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 107 పరుగులు సాధించాడు. చివర్లో సూర్యాంశ్ షెడ్గే కేవలం 14 బంతుల్లో 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 36 పరుగులు చేసి జట్టు స్కోరును 330 దాటించాడు. నేపాల్ బౌలర్లలో లలిత్ రాజ్‌బన్షీ, సందీప్ లమిచానే తలో మూడు వికెట్లు తీయగా, నందన్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Also Read
333 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ బ్యాటర్లు భారత పేసర్ల ధాటికి నిలబడలేకపోయారు. తొలి ఓవర్ మూడో బంతికే అర్జున్ కుమల్ను హర్షిత్ రాణా ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయగా, ఆ తర్వాత ప్రిన్స్ యాదవ్ వరుస వికెట్లతో నేపాల్‌ను దెబ్బకొట్టాడు. ఏడో ఓవర్ ముగిసేసరికి నేపాల్ 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ప్రిన్స్ యాదవ్ 5 ఓవర్లలో కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, హర్షిత్ రాణా 6 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. షాబాజ్ అహ్మద్ ఒక వికెట్ తీశాడు. నేపాల్ జట్టులో ఎవరూ పది పరుగులు కూడా చేయలేకపోయారు.
నేపాల్ చేసిన 26 పరుగుల స్కోరు లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో ఐదో అత్యల్ప ఆలౌట్ స్కోరుగా నిలిచింది. గతంలో వెస్టిండీస్ అండర్-19 (18), సారాసెన్స్ స్పోర్ట్స్ క్లబ్ (19), మిడిల్సెక్స్ (23), ఒమన్ (24) తక్కువ స్కోర్లకు ఆలౌటయ్యాయి. తిలక్ వర్మ సారథ్యంలో బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్-ఏ ఏకపక్ష విజయాన్ని అందుకుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Live Day-7 : కోటి దీపోత్సవం ఏడో రోజు.. నేడు త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణం
-
Ind Vs Nepal: నేపాల్‌పై భారత్-ఏ భారీ విజయం.. 306 పరుగుల తేడాతో వరల్డ్ రికార్డు బద్దలు..
-
Student Suicide : శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. విద్యార్థి సంఘాల ఆందోళన..
-
OTR: రాజమహేంద్రవరం వైసీపీలో వెన్నుపోట్ల కలకలం
-
OTR: ఉరుములేని పిడుగులా ఆశిష్ షెలార్ ఎంట్రీ.. తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది?
-
Ajit Doval: అజిత్ దోవల్‌కు అమెరికా కోర్టు సమన్లు.. భారత్ తీవ్ర అభ్యంతరం..
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!