NTV Telugu Site icon

Election Campaign: మెడలో చెప్పుల దండ వేసుకుని ఎన్నికల ప్రచారం చేస్తున్న లోక్‌సభ అభ్యర్థి..!

4

4

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ లోక్‌సభ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థి అయిన పండిట్ కేశవ్ దేవ్, భారత ఎన్నికల సంఘం తనకు కేటాయించిన పోలింగ్ చిహ్నాన్ని బాగా వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారానన్ని కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసాడు. అతని ఎన్నికల గుర్తు చెప్పుల జత కావడంతో., స్వతంత్ర అభ్యర్థి ఏడు చెప్పులు కలిసున్న ఓ దండను ధరించి తన ప్రచార బాటలో కనిపించారు. ఓ ప్రముఖ మీడియా సంస్థ షేర్ చేసిన వీడియోలో.. పండిట్ కేశవ్ దేవ్ చెప్పుల దండ, తెల్లటి తలపాగా ధరించి కొంతమంది మద్దతుదారులతో కనిపించారు.

Also Read: Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై పోటీకి దిగుతున్న తమన్నా

ఇక ఈయన మద్దతుదారుల్లో ఒకరు అభ్యర్థి చిత్రం, స్లిప్పర్ పోల్ గుర్తుతో కూడిన ” సమర్థిత్ భ్రష్టాచార వ్యతిరేక సేన” (అవినీతి నిరోధక సైన్యం) అనే బ్యానర్‌ ను పట్టుకున్నారు. అతను ” భ్రష్టాచర్ కా వినాష్ ” (అవినీతిని నాశనం చేయడం) లక్ష్యంగా రాబోయే జాతీయ ఎన్నికలకు మద్దతు కోరుతూ వీధుల్లోని ఆహార విక్రేతలు, దుకాణదారులు, పౌరుల వద్దకు వెళ్తున్నాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ గౌతమ్ 6,56,215 ఓట్లతో అలీగఢ్ స్థానంలో గెలుపొందారు. బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన అజిత్ బలియన్‌పై 4,26,954 ఓట్లతో విజయం సాధించారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థి బిజేంద్ర సింగ్ 50,880 ఓట్లను మాత్రమే సాధించగలిగారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో., సతీష్ గౌతమ్ మొత్తం 48 శాతం ఓట్లను పొంది తొలిసారిగా ఈ స్థానాన్ని గెలుచుకున్నారు.

Also Read: Vijay Deverakonda: హ్యాపెనింగ్ హీరోయిన్ పై కన్నేసిన విజయ్.. నెక్స్ట్ మూవీ ఆమెతోనే?

ఇకపోతే తాజాగా భారత ఎన్నికల సంఘం ఏప్రిల్ 8న స్వతంత్ర అభ్యర్థులందరికీ ఎన్నికల గుర్తులను కేటాయించింది. ఇందులో ఐస్ క్రీం కోన్, ల్యాప్‌టాప్, ద్రాక్ష వంటి చిహ్నాలు అనేకం ఉన్నాయి. ఇతర ప్రత్యేక పోల్ చిహ్నాలలో పండ్ల బుట్ట, హెల్మెట్, జాక్ ఫ్రూట్, రిఫ్రిజిరేటర్, టూత్ బ్రష్, కుట్టు యంత్రం, టీవీ ఉన్నాయి. ఇందులో భాగంగా కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమత్ గోగోకు బ్యాటరీ టార్చ్ గుర్తును కేటాయించారు; అస్సాంలోని బోర్‌భాగియా స్థానం నుంచి జ్యోతిస్క రంజన్‌సింగ్‌ కు టైర్ గుర్తును కేటాయించారు. అసోంలోని గోలాఘాట్ స్థానం నుంచి మరో స్వతంత్ర అభ్యర్థి త్రివేది జ్యోతి భియున్‌ కు ద్రాక్ష గుర్తును కేటాయించారు.