NTV Telugu Site icon

Ajit Agarkar BCCI Chairman: అజిత్ అగార్కర్‌ నాణ్యమైన క్రికెటర్లను అందిస్తాడు: యువరాజ్‌

Ajit Agarkar

Ajit Agarkar

Sachin Tendulkar, Yuvraj Singh Has Lunch With New BCCI Chief Selector Ajit Agarkar: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా మాజీ పేసర్ అజిత్ అగార్కర్‌ నియామకం అయిన విషయం తెలిసిందే. బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఏకగ్రీవంగా అగార్కర్‌ను సెలక్షన్ కమిటీ చీఫ్‌గా ఎంపిక చేసింది. చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే.. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌కు యువ జట్టును ఎంపిక చేసిన అగార్కర్‌.. తనదైన మార్క్ చూపించాడు. అయితే అగార్కర్‌ నియామకంపై మాజీ ప్లేయర్ యువరాజ్‌ సింగ్ ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

‘అజిత్‌ అగార్కర్‌కు కంగ్రాట్స్. బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా రాణిస్తావనే నమ్మకం ఉంది. తప్పకుండా భారత క్రికెట్‌ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తావని నేను భావిస్తున్నా. భారత జట్టుకు నాణ్యమైన క్రికెటర్లను అందించడంలో కీలక పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అంటూ యువరాజ్‌ సింగ్ ట్వీట్ చేశాడు. యువరాజ్‌, అగార్కర్‌కలిసి భారత జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. ఇద్దరు మంచి స్నేహితులు కూడా.

Sachin Agarkar

ప్రస్తుతం లండన్‌లో ఉన్న అజిత్‌ అగార్కర్‌ను యువరాజ్‌ సింగ్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తమ ఫ్యామిలీలతో కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘ఓ రెండు విషయాలు మనల్ని (అజిత్‌ అగార్కర్‌, యువరాజ్‌ సింగ్) మరింత దగ్గర చేస్తాయి. ఒకటి ఫ్రెండ్‌షిప్, రెండోది ఫుడ్. ఇలాంటి స్నేహపూరిత వాతావరణంలో లంచ్‌ను ఆస్వాదించడం చాలా బాగుంది’ అని సచిన్ పేర్కొన్నారు.

Also Read: IND vs WI: మూడు ఫార్మాట్‌లలో దక్కిన చోటు.. భవిష్యత్ స్టార్స్ ఈ నలుగురేనా!

Also Read: IND vs WI: ఇకపై టీ20ల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను చూడలేమా?

 

Show comments