Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ind Vs Wi Test Team India Set For Delhi Clash Big Changes Likely In Playing Xi

IND vs WI Test: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ సెకండ్ టెస్ట్.. టీమిండియాలో భారీ మార్పులు?

Published Date :October 10, 2025 , 7:39 am
By Kothuru Ram Kumar
IND vs WI Test: నేటి నుంచి భారత్, వెస్టిండీస్ సెకండ్ టెస్ట్.. టీమిండియాలో భారీ మార్పులు?
  • Follow Us :
  • google news
  • dailyhunt

IND vs WI Test: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా, టీమిండియా ప్రస్తుతం రెండో టెస్ట్ కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలోకి చేరుకుంది. అహ్మదాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌ను కేవలం రెండున్నర రోజుల్లోనే ఇన్నింగ్స్ తేడాతో ముగించిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు, నేటి (అక్టోబర్ 10) నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో అంచనాలకు అనుగుణంగా సులభ విజయం సాధించిన భారత్, రెండో టెస్ట్‌లోనూ అదే రీతిలో ఆధిపత్యం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్-11లో ఏమైనా మార్పులు చోటుచేసుకుంటాయా అనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

న్యూఢిల్లీలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో వాతావరణం చల్లబడింది. అయితే, శుక్రవారం జరిగే మ్యాచ్ తొలి రోజు వర్షం పడే అవకాశం తక్కువగా ఉంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఉష్ణోగ్రత 25 నుండి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. అరుణ్ జైట్లీ స్టేడియం పిచ్‌లో ఉదయం వేళల్లో కొద్దిగా గాలి వీచే అవకాశం ఉండటంతో ఫాస్ట్ బౌలర్లకు కొంత సహాయం లభించవచ్చు. అయినప్పటికీ, ఢిల్లీ పిచ్ ఎప్పటిలాగే స్పిన్నర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈసారి మాత్రం బ్యాట్స్‌మెన్‌కి కూడా సౌకర్యంగా ఉండే పిచ్‌గా కనిపిస్తోంది. అందువల్ల, ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడం మంచి నిర్ణయం కానుంది.

Pawan Kalyan : ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతే రాజకీయాలు వదిలేస్తా..

తొలి టెస్ట్ త్వరగా ముగియడంతో బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు ఐదు రోజుల విశ్రాంతి లభించినప్పటికీ, అతని వర్క్‌ లోడ్ దృష్ట్యా ఈ మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇవ్వవచ్చని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. బుమ్రా బదులు యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు జట్టులో అవకాశం దక్కే అవకాశం ఉంది. ఢిల్లీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారత్ ప్లేయింగ్-11లో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉండే అవకాశం ఉంది.

అరుణ్ జైట్లీ స్టేడియం టీమిండియాకు కోటగా ఉంది. గత 38 సంవత్సరాలుగా ఈ మైదానంలో భారత్ ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. చివరిసారి భారత్ ఇక్కడ ఓటమి చవిచూసింది 1987లో అది కూడా వెస్టిండీస్ చేతుల్లోనే. ఆ తర్వాత భారత్ ఈ మైదానంలో ఆడిన 13 టెస్టుల్లో 11 గెలుపులు సాధించి, 2 డ్రా చేసుకుంది. అయితే 1987 నాటి వెస్టిండీస్ జట్టుకు, ఇప్పటి 2025 జట్టుకు చాలా తేడా ఉంది. తొలి టెస్ట్‌లో పూర్తిగా నిరాశపరిచిన కరీబియన్ జట్టు, రెండో టెస్ట్‌లో గట్టి పోరాటం ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఇక హెడ్-టు-హెడ్ రికార్డుల పరంగా వెస్టిండీస్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లుగా భారత్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు భారత్-వెస్టిండీస్ జట్లు 101 టెస్టుల్లో తలపడ్డాయి. అందులో భారత్ 24 మ్యాచ్‌లు గెలవగా, వెస్టిండీస్ 30 విజయాలు సాధించింది. 47 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.

Astrology: అక్టోబర్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఏ రాశి వారు ఏం చేయాలంటే..?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arun Jaitley Stadium pitch report
  • Delhi Test
  • IND vs WI Test
  • India vs West Indies
  • India vs West Indies stats

తాజావార్తలు

  • Prabhas vs Shahrukh : మరోసారి ప్రభాస్, షారూఖ్ ఢీకొట్టబోతున్నారా.?

  • Kobbari Undalu: ముప్పై ఏళ్లు దాటిన మహిళలకు వరం.. అమృతంతో సమానమైన కొబ్బరి ఉండలు సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • Delhi: దేశ రాజధాని ఢిల్లీని కమ్మేసిన దుమ్ము తుఫాన్.. దారి కనిపించక ప్రజలు ఇబ్బందులు

  • Jr NTR : ఎన్టీఆర్‌ను ఢీ కొట్టేదెవరు?

  • Ishan Kishan: నేను హ్యాపీగా లేను.. ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • ప్రీమియం లుక్ బడ్జెట్ ధరలోనే.. మిలిటరీ గ్రేడ్ మన్నికతో కొత్త Redmi Note 15 SE 5G లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇలా.!

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions