Rinku Singh Fail To Find Place In Team India T20I Squad For WI Series: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వెస్టిండీస్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్ ఆడే భారత జట్టును ప్రకటించాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో ఐపీఎల్ 2023లో సత్తాచాటిన యశస్వి జైస్వాల్, తిలక్ వర్మకు చోటు దక్కింది. అయితే ఐపీఎల్ 2023లోనే సత్తాచాటిన రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, నితీశ్ రాణా, జితేశ్ శర్మకు బీసీసీఐ సెలెక్టర్లు అవకాశం ఇవ్వలేదు. దీంతో అజిత్ అగార్కర్ బృందంపై ఫాన్స్, నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2023లో రింకూ సింగ్ 14 మ్యాచులు ఆడి 474 పరుగులు చేసాడు. 59.25 సగటుతో 149.53 స్ట్రైయిక్ రేటుతో రన్స్ బాదాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కూడా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది కేకేఆర్ జట్టుకి ఊహించని విజయాన్నందించాడు. 4 హాఫ్ సెంచరీలు చేసిన రింకూ.. ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 ప్లేయర్ల జాబితాలో నిలిచాడు.
Also Read: India vs Pakistan Records: వన్డే ప్రపంచకప్ 2023.. భారత్-పాకిస్తాన్ గత రికార్డ్స్ ఇవే! టీమిండియాదే..
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో రింకూ సింగ్ పేరు లేకపోవడంపై బీసీసీఐపై నెటిజన్లు మండిపడుతున్నారు. రింకూ సింగ్‌ని పక్కనపెట్టడానికి కారణం ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. ‘టీ20 జట్టులోకి వచ్చేందుకు రింకు సింగ్ అర్హుడు’, ‘రింకు సింగ్ లేకుండా జట్టు ఎంపిక చేయడమా?’, ‘టీ20 సిరీస్‌కు రింకు సింగ్‌ను ఎంపిక చేస్తే బాగుండేది’ అని ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. రింకు సింగ్ పేరును బీసీసీఐ సెలెక్టర్లు పరిశీలించకపోవడంపై మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు. రింకు సింగ్‌కు భారత జట్టులోకి వచ్చే సమయం త్వరలోనే వస్తుంది అని ట్వీట్ చేశాడు.
ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ ఉండటంతో రుతురాజ్ గైక్వాడ్‌ను సెలక్షన్ కమిటీ పక్కన పెట్టింది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. దాంతో రింకూ సింగ్, నితీశ్ రాణాలకు చోటు దక్కలేదు. ఇక ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ వికెట్ కీపర్ల కోటాలో ముందుండటంతో జితేశ్ శర్మకు అవకాశం రాలేదు.
Also Read: Virat Kohli Out: ఉనాద్కత్ బౌలింగ్‌లో కోహ్లీ ఔట్.. వీడియో వైరల్!