NTV Telugu Site icon

IND vs SL: భారత్‌తో రెండో వన్డే.. శ్రీలంకకు భారీ షాక్! 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ ఎంట్రీ

Wanindu Hasaranga

Wanindu Hasaranga

Wanindu Hasaranga Out From IND vs SL ODI Series: నేడు కొలంబో వేదిక‌గా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య రెండో వ‌న్డే జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. స్టార్ స్పిన్నర్ వానిందు హసరంగా గాయంతో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం కార‌ణంగా హ‌స‌రంగా మిగిలిన రెండు వ‌న్డేల‌కు దూర‌మ‌య్యాడు. హ‌స‌రంగా దూరమవడం లంకకే భారీ ఎదురుదెబ్బే అని చెప్పాలి. అతడి స్థానంలో 34 ఏళ్ల లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే ఎంపికయ్యాడు.

Also Read: Djokovic vs Alcaraz: అల్‌కరాజ్‌తో ఫైనల్‌.. జొకోవిచ్‌ స్వర్ణ స్వప్నం నెరవేరేనా?

భారత్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో వానిందు హ‌స‌రంగా మోకాలికి గాయ‌మైంది. అయినా కూడా మ్యాచ్ మొత్తానికి అందుబాటులో ఉన్నాడు. స్కానింగ్‌లో గాయం తీవ్ర‌మైన‌దిగా తేల‌డంతో వైద్యులు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని సూచించారు. దాంతో హ‌స‌రంగా సిరీస్ మ‌ధ్య‌లోనే వైదొలిగాడు. తొలి వన్డేలో హసరంగా అసాధారణ ప్రదర్శన చేశాడు. బౌలింగ్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 24 పరుగులు చేశాడు. ఇక ఇప్పటి వరకు ఆడిన 55 వన్డే మ్యాచ్‌లలో 87 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌కు ఇప్పటికే శ్రీలంక స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక దూరమైన విషయం తెలిసిందే.