NTV Telugu Site icon

Hardik-Agarkar: అందుకే హార్దిక్‌‌ పాండ్యాను కెప్టెన్‌ చేయలేదు: చీఫ్ సెలక్టర్ అగార్కర్

Hardik Pandya

Hardik Pandya

Ajit Agarkar explains why choose Suryakumar Yadav as Captain over Hardik Pandya: శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా నయా హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇచ్చారు. కొందరు యువకులకు అవకాశం రాకపోవడం, విరాట్‌ కోహ్లీతో సంబంధాలు, సీనియర్ల విషయంపై స్పందించారు. హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వివరణ ఇచ్చారు. ఫిట్‌నెస్ కారణంగానే హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

టీ20 ప్రపంచకప్ 2024ను భారత జట్టు గెలవడంతో హార్దిక్‌‌ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కూడా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. కెప్టెన్‌గా హార్దిక్ ఎంపికవుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ సెలక్టర్లు నియమించారు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌కు సూర్యను కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా ఉండనున్నాడు. దాంతో హార్దిక్‌కు నిరాశే ఎదురైంది. హార్దిక్‌కు ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు.

Also Read: Gambhir-Jadeja: జడేజా అత్యంత కీలక ప్లేయర్.. అతడిని జట్టు నుంచి తప్పించలేదు: గంభీర్‌

ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ… ‘హార్దిక్‌‌ పాండ్యా మాకు కీలక ఆటగాడు. అద్భుత నైపుణ్యం ఉన్న ప్లేయర్. అయితే ఫిట్‌నెస్ అతనికి సవాలుగా మారింది. జట్టు ఎంపికపుడు కోచ్ లేదా సెలెక్టర్లకు ఇది కష్టమవుతుంది. ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకే నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి. అందుకే సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించాం. టీ20 అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకడు. కెప్టెన్‌గా ఉండేందుకు కావాల్సిన లక్షణాలు సూర్యకు ఉన్నాయని మేము నమ్మాము’ అని తెలిపాడు.