Hardik-Agarkar: అందుకే హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయలేదు: చీఫ్ సెలక్టర్ అగార్కర్
- ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అజిత్ అగార్కర్
- 2026 వరకు సూర్యనే కెప్టెన్
- అందుకే పాండ్యాను కెప్టెన్ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajit Agarkar explains why choose Suryakumar Yadav as Captain over Hardik Pandya: శ్రీలంక పర్యటన నేపథ్యంలో టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ మీడియా సమావేశంలో రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు ఇద్దరు సమాధానం ఇచ్చారు. కొందరు యువకులకు అవకాశం రాకపోవడం, విరాట్ కోహ్లీతో సంబంధాలు, సీనియర్ల విషయంపై స్పందించారు. హార్దిక్ పాండ్యాను టీ20 కెప్టెన్‌గా ఎందుకు ఎంపిక చేయలేదనే ప్రశ్నకు చీఫ్ సెలక్టర్ అగార్కర్ వివరణ ఇచ్చారు. ఫిట్‌నెస్ కారణంగానే హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
టీ20 ప్రపంచకప్ 2024ను భారత జట్టు గెలవడంతో హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు కూడా భారత టీ20 జట్టుకు సారథ్యం వహించాడు. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. కెప్టెన్‌గా హార్దిక్ ఎంపికవుతాడని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్‌ను బీసీసీఐ సెలక్టర్లు నియమించారు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‌కు సూర్యను కెప్టెన్‌గా సెలక్ట్ చేశారు. టీ20 ప్రపంచకప్ 2026 వరకు సూర్యనే కెప్టెన్‌గా ఉండనున్నాడు. దాంతో హార్దిక్‌కు నిరాశే ఎదురైంది. హార్దిక్‌కు ఎందుకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వలేదో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివరణ ఇచ్చారు.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Abhishek Sharma Records: రికార్డుల మోతమోగించిన అభిషేక్ శర్మ..!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
Also Read: Gambhir-Jadeja: జడేజా అత్యంత కీలక ప్లేయర్.. అతడిని జట్టు నుంచి తప్పించలేదు: గంభీర్
ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అజిత్ అగార్కర్ మాట్లాడుతూ… ‘హార్దిక్ పాండ్యా మాకు కీలక ఆటగాడు. అద్భుత నైపుణ్యం ఉన్న ప్లేయర్. అయితే ఫిట్‌నెస్ అతనికి సవాలుగా మారింది. ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యమైనది. జట్టు ఎంపికపుడు కోచ్ లేదా సెలెక్టర్లకు ఇదే క్లిష్టంగా మారింది. టీ20 ప్రపంచకప్ మరో రెండేళ్లలో జరగనుంది. నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి. అందుకే సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ప్రకటించాం. టీ20 అత్యుత్తమ బ్యాటర్లలో సూర్య ఒకడు. కెప్టెన్‌గా ఉండేందుకు కావాల్సిన లక్షణాలు సూర్యకు ఉన్నాయని మేము నమ్మాము. ప్లేయర్స్ అభిప్రాయం కూడా తీసుకున్నాం’ అని తెలిపాడు.
తాజావార్తలు
-
Diljit Dosanjh: వెంబ్లీ స్టేడియంలో ‘సాన్సోం కి మాలా’.. దిల్జిత్తో 90 వేల మంది ఫ్యాన్స్ మాస్ సెలబ్రేషన్!
-
Women’s Asia Cup 2026: ఆసియా కప్‌లో టీమిండియా జోరు.. ఆ నలుగురే వల్లే ట్రోఫీ!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
-
Bushra Bano: ‘అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్” అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
ట్రెండింగ్
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?