NTV Telugu Site icon

Virat Kohli: డీన్ ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికిన విరాట్‌ కోహ్లీ!

Virat Kohli Dean Elgar

Virat Kohli Dean Elgar

Virat Kohli Wins Hearts With Priceless Gesture For Dean Elgar: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్‌ ఎల్గర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్‌లో ఆఖరి టెస్ట్‌ ఆడిన ఎల్గర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ స్పెషల్‌ గిఫ్ట్స్ అందించారు. ముఖ్యంగా కోహ్లీ ప్రొటీస్ తాత్కాలిక కెప్టెన్ ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికాడు.

మ్యాచ్ అనంతరం భార‌త జ‌ట్టు ప్లేయర్స్ సంత‌కాలు చేసిన జెర్సీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డీన్ ఎల్గర్‌కు కానుక‌గా ఇచ్చాడు. ఆపై ఎల్గర్‌కు విరాట్ కోహ్లీ ఆల్ ది బెస్ట్ చెప్పి.. తాను సంత‌కం చేసిన‌ జెర్సీని కానుక‌గా అందించాడు. అంతకుముందు చివరిసారి బ్యాటింగ్‌కు వచ్చి ఔటౌన తర్వాత ఎల్గర్‌ డగౌట్‌కు వెళుతున్నప్పుడు.. కోహ్లీ తన చేతులు వంచి నమస్కరించాడు. అంతేకాదు గ్యాలరీలోని ప్రేక్షకులను కూడా అలా చేయాలని కోరాడు. చివరి టెస్ట్ కాబట్టి ఎల్గర్‌ క్యాచ్‌ పట్టినప్పటికీ.. కోహ్లీ ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేసుకోలేదు. ఇలా కోహ్లీ అందరి మనసులు గెల్చుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: #90’s Web Series: ఓటీటీలోకి #90’S వెబ్ సిరీస్!

డీన్ ఎల్గర్‌ సెంచూరియన్ టెస్టులో 185 పరుగులు చేశాడు. అయితే కేప్ టౌన్ టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటైన ఎల్గర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసి ముఖేష్ కుమార్‌కు చిక్కాడు. ఎల్గర్‌ దక్షిణాఫ్రికా తరఫున 84 టెస్టుల్లో 37.28 సగటుతో 5146 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 8 వన్డేలు ఆడిన ఎల్గర్‌ 104 పరుగులు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బావుమా గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమవగా.. ఎల్గర్‌ సారథ్యం వహించిన విషయం తెలిసిందే.