Virat Kohli: డీన్ ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Wins Hearts With Priceless Gesture For Dean Elgar: దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ సిరీస్‌తో దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కెరీర్‌లో ఆఖరి టెస్ట్ ఆడిన ఎల్గర్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్స్ అందించారు. ముఖ్యంగా కోహ్లీ ప్రొటీస్ తాత్కాలిక కెప్టెన్ ఎల్గర్‌కు అద్భుతమైన వీడ్కోలు పలికాడు.
మ్యాచ్ అనంతరం భారత జట్టు ప్లేయర్స్ సంతకాలు చేసిన జెర్సీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డీన్ ఎల్గర్‌కు కానుకగా ఇచ్చాడు. ఆపై ఎల్గర్‌కు విరాట్ కోహ్లీ ఆల్ ది బెస్ట్ చెప్పి.. తాను సంతకం చేసిన జెర్సీని కానుకగా అందించాడు. అంతకుముందు చివరిసారి బ్యాటింగ్‌కు వచ్చి ఔటౌన తర్వాత ఎల్గర్ డగౌట్‌కు వెళుతున్నప్పుడు.. కోహ్లీ తన చేతులు వంచి నమస్కరించాడు. అంతేకాదు గ్యాలరీలోని ప్రేక్షకులను కూడా అలా చేయాలని కోరాడు. చివరి టెస్ట్ కాబట్టి ఎల్గర్ క్యాచ్ పట్టినప్పటికీ.. కోహ్లీ ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదు. ఇలా కోహ్లీ అందరి మనసులు గెల్చుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
Also Read: #90’s Web Series: ఓటీటీలోకి #90’S వెబ్ సిరీస్!
డీన్ ఎల్గర్ సెంచూరియన్ టెస్టులో 185 పరుగులు చేశాడు. అయితే కేప్ టౌన్ టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఔటైన ఎల్గర్.. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసి ముఖేష్ కుమార్‌కు చిక్కాడు. ఎల్గర్ దక్షిణాఫ్రికా తరఫున 84 టెస్టుల్లో 37.28 సగటుతో 5146 పరుగులు చేశాడు. ఇందులో 13 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 8 వన్డేలు ఆడిన ఎల్గర్ 104 పరుగులు చేశాడు. రెగ్యులర్ కెప్టెన్ తెంబా బావుమా గాయంతో టెస్ట్ సిరీస్‌కు దూరమవగా.. ఎల్గర్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే.
#MukeshKumar‘s nibbler gets #DeanElgar on his final test!
Will #TeamIndia keep racking up wickets before the day’s play?
Tune in to #SAvIND 2nd Test
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/qftk1SpI8D— Star Sports (@StarSportsIndia) January 3, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు