NTV Telugu Site icon

IND vs SA: సిరాజ్‌ హిందీకి బుమ్రా అనువాదం.. వీడియో వైరల్‌!

Bumrah Siraj

Bumrah Siraj

పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు పేస్‌ గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ట్రాన్స్‌లేటర్‌గా మారాడు. సిరాజ్‌ హిందీలో మాట్లాడితే.. బుమ్రా ఆ వ్యాఖ్యలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విషయం సాధించింది. ఈ విజయంలో బుమ్రా, సిరాజ్‌ కీలక పాత్ర పోషించారు. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్‌ 6 వికెట్స్ తీయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా 6 వికెట్స్ పడగొట్టాడు.

Also Read: AUS vs PAK: క్యాప్‌తో బంతిని ఆపినా.. 5 పరుగుల పెనాల్టీ ఇవ్వని క్రికెట్ ఆస్ట్రేలియా! కారణం ఏంటంటే

మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్స్ తీసిన మొహమ్మద్ సిరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా సిరాజ్‌ హిందీలో మాట్లాడగా.. దానిని బుమ్రా ఆంగ్లంలోకి అనువదించాడు. ‘బుమ్రా బౌలింగ్‌ మొదలు పెట్టిన తర్వాత పిచ్‌ ఎలా స్పందిస్తుందో నాకు చెప్పాడు. అందుకు తగ్గట్టుగా నా లెంగ్త్‌ను మార్చుకున్నా. నేను మరీ ఎక్కువగా ఆలోచించలేదు. కానీ నిలకడగా ఒకే చోట బంతిని విసిరి వికెట్లను రాబట్టా. మరో ఎండ్‌లో బుమ్రా ఉంటే బౌలింగ్‌ చేయడం మరింత బాగుంటుంది’అని సిరాజ్‌ అన్నాడు.