ఆసియా కప్ 2025లో ఆదివారం (సెప్టెంబర్ 28) దాయాది పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్‌లో తలపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్, సూపర్-4లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది. మరోవైపు వరుస పరాభవాలకు చెక్ పెట్టాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఫైనల్‌లో భారత్ తుది జట్టు ఎలా ఉండనుందో ఓసారి చూద్దాం.
ఫైనల్‌కు ముందు శ్రీలంకతో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ శివమ్ దూబేలకు టీమిండియా మాజేన్మెంట్ రెస్ట్ ఇచ్చింది. పాకిస్థాన్‌తో ఫైనల్‌లో ఈ ఇద్దరు తిరిగి జట్టులోకి రానున్నారు. దాంతో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణాలు మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నారు. విన్నింగ్ కాంబినేషన్‌ను కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొనసాగించనున్నాడు. శ్రీలంక మ్యాచ్‌లో కండరాలు పట్టేసిన అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మలు ఆడే అవకాశాలే మెండుగా ఉన్నాయి. గాయపడిన వారిలో ఎవరైనా ఆడకుంటే అర్ష్‌దీప్ సింగ్, రింకూ సింగ్, జితేష్ శర్మలు సిద్ధంగా ఉన్నారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఆరంభాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. కెప్టెన్ సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఫైనల్లో అయినా 360 డిగ్రీస్ చూపించాల్సి ఉంది. తిలక్ వర్మ, సంజూ శాంసన్ ఫామ్‌లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా జట్టును ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్‌లో రాణిస్తున్న శివమ్ దూబే బ్యాటింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తీలు రాణిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా వికెట్స్ తీయాల్సి ఉంది.
Also Read: IND vs PAK Final: పాకిస్థాన్‌తో ఫైనల్ మ్యాచ్ ముందు.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్లకు గాయం!
భారత్ తుది జట్టు (అంచనా):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్ (కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తీ.
