ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ప్రస్తుత టోర్నమెంట్‌లో వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. గ్రూప్ దశ, సూపర్ ఫోర్ తర్వాత అనంతరం ఫైనల్‌లో కూడా పాకిస్థాన్‌ను ఓడించాలని భారత్ చూస్తోంది. ఆసియా కప్ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ తలపడడం ఇదే మొదటిసారి కాబట్టి.. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫైనల్ మ్యాచ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పాడు.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మపై సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అభిషేక్ తన అద్భుతమైన ఫామ్‌ను ఫైనల్‌లో కూడా కొనసాగిస్తాడని గవాస్కర్ జోస్యం చెప్పాడు. ఫైనల్‌లో అభిషేక్ సెంచరీ చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ఇండియా టుడేతో సన్నీ మాట్లాడుతూ… ‘అభిషేక్ శర్మ ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోడు. అతడు అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే మూడు అర్ధ సెంచరీలు చేశాడు. రనౌట్ కారణంగా బంగ్లాదేశ్‌పై సెంచరీని కోల్పోయాడు. ఫైనల్ మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడటానికి ప్రయత్నిస్తాడు. బహుశా సెంచరీ చేస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.
Also Read: IND vs PAK Final: ఫైనల్ కోసం భారత్ ప్రత్యేక హ్యూహం.. ఇంతకీ ఏంటబ్బా!
ఆసియా కప్ 2025లో అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలతో 309 పరుగులు చేశాడు. అతడి సగటు 51.50 కాగా.. స్ట్రైక్ రేట్ 204.63గా ఉంది. సెప్టెంబర్ 21న పాకిస్తాన్‌పై అభిషేక్ 74 పరుగుల సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేశాడు. ఈ టోర్నీలో భారత బ్యాటింగ్ అభిషేక్ శర్మపైనే ఎక్కువగా ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్‌లో అభిషేక్‌ను త్వరగా అవుట్ చేసేందుకు పాకిస్తాన్ బౌలర్లు చూస్తారు.
